Telugu Global
Cinema & Entertainment

విడాకుల తర్వాత సమంత పెట్టిన తొలి పోస్ట్

నాగచైతన్య-సమంత విడిపోయారనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ వాళ్లిద్దరూ అలా విడిపోవడానికి కారణాలేంటనేది మాత్రం కేవలం వాళ్లిద్దరికీ, ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. బయట జనాలకు పూర్తిగా తెలియని విషయం ఇది. అయితే వీళ్లిద్దరూ విడిపోవడానికి బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా సమంత పెట్టిన పోస్ట్ విషయ తీవ్రతకు అద్దం పడుతోంది. “నేను బాధలో, విచారంగా ఉన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పిన మాటలే గుర్తొస్తాయి. చరిత్రలో ఎప్పుడూ ప్రేమ, నిజాయితీలే శాశ్వతం. కొందరు హంతకులు, […]

విడాకుల తర్వాత సమంత పెట్టిన తొలి పోస్ట్
X

నాగచైతన్య-సమంత విడిపోయారనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ వాళ్లిద్దరూ అలా విడిపోవడానికి
కారణాలేంటనేది మాత్రం కేవలం వాళ్లిద్దరికీ, ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. బయట జనాలకు
పూర్తిగా తెలియని విషయం ఇది. అయితే వీళ్లిద్దరూ విడిపోవడానికి బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా సమంత పెట్టిన పోస్ట్ విషయ తీవ్రతకు అద్దం పడుతోంది.

“నేను బాధలో, విచారంగా ఉన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పిన మాటలే గుర్తొస్తాయి. చరిత్రలో ఎప్పుడూ
ప్రేమ, నిజాయితీలే శాశ్వతం. కొందరు హంతకులు, నియంతలు ఉంటారు. వెన్నుపోటు పొడుస్తారు. వాళ్ల
గెలుపు ఎప్పుడూ తాత్కాలికమే. వాళ్లు ఎప్పటికైనా నేలకొరగక తప్పదు. ఇదే జరిగి తీరుతుంది. ఇది చరిత్ర
చెప్పిన నిజం. మా అమ్మ నాకు చెప్పిన నిజం.”

తామిద్దరం విడిపోయామని ప్రకటించిన తర్వాత సమంత పెట్టిన మొట్టమొదటి పోస్ట్ ఇదే. ఈ సందేశంతో ఆమె కొంతమందిని హంతకులు, నియంతలు అంటూ పేర్కొంది. వెన్నుపోటు అనే పదం కూడా వాడింది. అంటే నాగచైతన్య-సమంత విడాకుల వెనక చాలా పెద్ద యుద్ధమే జరిగినట్టు అనుకోవాలి. అంతా అనుకుంటున్నట్టు అది కేవలం సినిమాలో, డబ్బో కాదు. ఇంకేదో బలమైన కారణం వల్లనే వీళ్లిద్దరూ విడిపోయారనే విషయం, తాజాగా సమంత పెట్టిన పోస్ట్ ద్వారా అర్థమౌతోంది.

First Published:  3 Oct 2021 11:05 AM IST
Next Story