Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే

సస్పెన్స్ వీడింది. ఊహాగానాలే నిజమయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. అందరూ ఊహించినట్టుగానే ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపారు. జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకాబోతున్నట్టు స్వయంగా దర్శకుడు రాజమౌళి ప్రకటించాడు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలతో పాటు.. ఒకేసారి 15 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులతో సంప్రదింపులు జరిగిన తర్వాత విడుదల తేదీ ఫిక్స్ చేశారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో […]

ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే
X

సస్పెన్స్ వీడింది. ఊహాగానాలే నిజమయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. అందరూ ఊహించినట్టుగానే ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపారు. జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా
విడుదలకాబోతున్నట్టు స్వయంగా దర్శకుడు రాజమౌళి ప్రకటించాడు.

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలతో పాటు.. ఒకేసారి 15 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులతో సంప్రదింపులు జరిగిన తర్వాత విడుదల తేదీ ఫిక్స్ చేశారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టుడియోస్ తో చర్చలు జరిపి ఈ తేదీని లాక్ చేశారు.

గమ్మత్తైన విషయం ఏంటంటే.. అలియాభట్ నటించిన గంగూబాయి కతియావాడి అనే హిందీ సినిమా సరిగ్గా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు 24 గంటల ముందు రిలీజ్ అవుతోంది. సంజయ్ లీలా భన్సాలీ దీనికి దర్శకుడు. అలా తన సినిమాతో తానే పోటీపడబోతోంది అలియా భట్.

First Published:  2 Oct 2021 12:52 PM IST
Next Story