నాగచైతన్య-సమంత విడిపోయారు
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య-సమంత విడిపోయారు. నాగచైతన్య సక్సెస్ ఫుల్ హీరోగా, సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. వీళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా నాలుగేళ్లు వైవాహిక జీవితం గడిపిన తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీళ్ల విడాకులకు కారణం ఏంటనేది బయటకు రాలేదు. తను, సమంత విడిపోతున్నట్టు నాగచైతన్య ట్విట్టర్ లో ప్రకటించాడు. సరిగ్గా అదే సమయానికి సమంత కూడా నాగచైతన్యతో వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు ఇనస్టాగ్రామ్ లో ప్రకటించింది. అలా వీళ్లిద్దరూ ఒకేసారి తమ విడాకుల వ్యవహారాన్ని […]
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య-సమంత విడిపోయారు. నాగచైతన్య సక్సెస్ ఫుల్ హీరోగా, సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. వీళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా నాలుగేళ్లు వైవాహిక జీవితం గడిపిన తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీళ్ల విడాకులకు కారణం ఏంటనేది బయటకు రాలేదు.
తను, సమంత విడిపోతున్నట్టు నాగచైతన్య ట్విట్టర్ లో ప్రకటించాడు. సరిగ్గా అదే సమయానికి సమంత కూడా నాగచైతన్యతో వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు ఇనస్టాగ్రామ్ లో ప్రకటించింది. అలా వీళ్లిద్దరూ ఒకేసారి తమ విడాకుల వ్యవహారాన్ని బయటపెట్టారు.
కొన్నాళ్లుగా నాగచైతన్య-సమంత విడాకులపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. కానీ చాలామంది వాటిని నమ్మలేదు. పుకార్లుగా కొట్టిపారేశారు. ఈరోజుతో ఆ ఊహాగానాలన్నీ నిజమని తేలిపోయాయి. భార్యాభర్తలుగా విడిపోయినా, పదేళ్ల తమ స్నేహబంధాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తామని ఇద్దరూ ప్రకటించుకున్నారు.
తాజాగా నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలై, సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఇటు
సమంత, శాకుంతలం అనే సినిమాలో నటించింది. విడుదల కోసం వెయిటింగ్. తను హైదరాబాద్ లోనే
ఉంటానని సమంత ప్రకటించింది.