Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్య, సమంత విడాకులు : అధికారిక ప్రకటన..!

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోనున్నారని.. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అదే ఇప్పుడు నిజమైంది. నాగచైతన్య, సమంత తాము విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు నాగచైతన్య ట్విట్టర్ ద్వారా వెల్లడించగా, ఇన్ స్టా గ్రామ్ వేదికగా నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు సమంత ప్రకటించింది. ‘సమంత నేను విడిపోతున్నాం. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. నాలుగేళ్ల వివాహబంధానికి ముగింపు పలుకుతున్నాం. ఏడేళ్లపాటు స్నేహంగా ఉండి ఒక్కటయ్యాం.అభిమానులు అర్థం చేసుకోవాలి. తమ […]

నాగచైతన్య, సమంత విడాకులు : అధికారిక ప్రకటన..!
X

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోనున్నారని.. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అదే ఇప్పుడు నిజమైంది. నాగచైతన్య, సమంత తాము విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు నాగచైతన్య ట్విట్టర్ ద్వారా వెల్లడించగా, ఇన్ స్టా గ్రామ్ వేదికగా నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు సమంత ప్రకటించింది.

‘సమంత నేను విడిపోతున్నాం. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. నాలుగేళ్ల వివాహబంధానికి ముగింపు పలుకుతున్నాం. ఏడేళ్లపాటు స్నేహంగా ఉండి ఒక్కటయ్యాం.అభిమానులు అర్థం చేసుకోవాలి. తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దు. భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటాం’ అని నాగచైతన్య ట్వీట్ చేశాడు. నాగ చైతన్య ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సమంత కూడా ఇదే విషయమై ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్టు చేసింది. నాగ చైతన్యతో విడాకుల విషయమై ధ్రువీకరించింది. ఇన్ని రోజులు తమకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

2010లో నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా ఏ మాయ చేసావే అనే సినిమా వచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుంచి వీరిద్దరూ స్నేహంగా మెలుగుతూ వచ్చారు. ఆ తర్వాత 2017లో గోవాలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. అప్పట్నుంచి ఈ జంట అన్యోన్యంగా ఉంటూనే వచ్చింది. నాగ చైతన్య సినిమా వస్తోందంటే చాలు సమంత ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ప్రచారం చేసేది.

అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. కొద్దిరోజుల కిందట సమంత తన ట్విట్టర్ ప్రొఫైల్లో సమంత అక్కినేని అని ఉన్న తన పేరును ‘ఎస్’ గా మార్చుకుంది. అప్పట్నుంచి వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దానికి తోడు కొద్ది రోజులుగా మీరు వేర్వేరుగా ఉంటున్నారు. సమంత చెన్నై లో ఉంటుండగా..చైతూ హైదరాబాదులో ఉంటున్నాడు. దీంతో వీరిద్దరూ దూరమయ్యేది నిజమేనని ప్రచారం జరిగింది. ఇవాళ నాగచైతన్య,సమంత అధికారికంగా తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది.

First Published:  2 Oct 2021 5:37 PM IST
Next Story