కరోనా చికిత్సకు తొలి ఔషధం.. 'మోల్ను పిరవిర్'
ఇప్పటి వరకూ కొవిడ్ చికిత్సలో వాడుతున్న ఔషధాలకు ప్రామాణికత ఏదీ లేదు. ఓ దశలో దేనికదే బ్రహ్మాండమైన ఔషధం అని చెప్పిన వైద్యులు, ఆ తర్వాత కొన్నిరోజులకు వాటివల్ల ఉపయోగమే లేదని స్టేట్ మెంట్లిచ్చారు. ఈమధ్యలో రెమిడిసివిర్ వంటి ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్ దందా మధ్యతరగతి జీవితాలను ఎంతలా కుదేలు చేసిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వ్యాక్సిన్ మినహా దేన్నీ నమ్మే పరిస్థితి లేదు. ఈ దశలో అమెరికాకు చెందిన మెర్క్ అండ్ కంపెనీ తయారు చేసిన […]
ఇప్పటి వరకూ కొవిడ్ చికిత్సలో వాడుతున్న ఔషధాలకు ప్రామాణికత ఏదీ లేదు. ఓ దశలో దేనికదే బ్రహ్మాండమైన ఔషధం అని చెప్పిన వైద్యులు, ఆ తర్వాత కొన్నిరోజులకు వాటివల్ల ఉపయోగమే లేదని స్టేట్ మెంట్లిచ్చారు. ఈమధ్యలో రెమిడిసివిర్ వంటి ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్ దందా మధ్యతరగతి జీవితాలను ఎంతలా కుదేలు చేసిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వ్యాక్సిన్ మినహా దేన్నీ నమ్మే పరిస్థితి లేదు. ఈ దశలో అమెరికాకు చెందిన మెర్క్ అండ్ కంపెనీ తయారు చేసిన ‘మోల్నుపిరవిర్’ మాత్ర కరోనా నివారణలో సమర్థంగా పనిచేస్తుందని తేలింది. ఈ మాత్ర వాడకం వల్ల ఆస్పత్రిపాలయ్యే అవకాశం 50 శాతం తగ్గిపోయిందని తెలుస్తోంది. మరణాల శాతం కూడా సగానికి సగం తగ్గిందని మెర్క్ కంపెనీ ప్రకటించింది.
తాము చేపట్టిన ప్రయోగాల్లో ‘మోల్నుపిరవిర్’ మాత్ర సమర్థంగా పనిచేసిందని మెర్క్ కంపెనీ ప్రకటించింది. దీని అత్యవసర వినియోగానికి అమెరికా వైద్య విభాగానికి మెర్క్ దరఖాస్తు చేసుకుంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ అనుమతి వస్తే వారాల వ్యవధిలోనే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పింది.
మొట్టమొదటి మాత్ర ఇదే..
కరోనా విలయతాండవం మొదలైన తర్వాత అన్ని ఔషధ కంపెనీలు వ్యాక్సిన్ తయారీపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. దీంతో ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కానీ కరోనా వైరస్ నివారణకు ఉపయోగపడే ఔషధాలపై మాత్రం పెద్దగా ప్రయోగాలు జరగలేదు. ఒకవేళ జరిగినా, రూపు మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతున్న కొవిడ్-19ని తట్టుకుని నిలబడే ఔషధాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఈ క్రమంలో జరుగుతున్న ప్రయోగాల్లో మెర్క్ కంపెనీ తయారు చేసిన ‘మోల్నుపిరవిర్’ మాత్ర ఇప్పుడు ఆశాజనక ఫలితాలనిస్తోంది. 775మందిపై ఈ ప్రయోగాలు జరగగా.. ఐదురోజులపాటు రోజుకి రెండు చొప్పున ‘మోల్నుపిరవిర్’ మాత్రలను వారికి ఇచ్చారు. వారిలో కొందరు ఆస్పత్రిపాలయినా 29రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్నారు. మరణాల సంఖ్య సున్నా. దీంతో ‘మోల్నుపిరవిర్’పై అందరికీ గురి కుదిరింది. అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతి ఇస్తే.. కొవిడ్ నివారణ చికిత్సలో వాడే తొలి ఔషధం ఇదే అవుతుంది.