Telugu Global
National

ఆ రేప్ కేసు విచారణాధికారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దే..

త్రివిధ దళాలు దేశానికి రక్షణనిస్తాయి. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో కేసుల విచారణ కూడా వాటి పరిధిలోకి వెళ్తుంది. ఇలాంటి అరుదైన ఘటనే తమిళనాడులో జరిగింది. బాధితురాలు, నిందితుడు.. ఇద్దరూ ఎయిర్ ఫోర్స్ కి చెందినవారే కావడంతో రేప్ కేసు విచారణను ఐఏఎఫ్ కి బదిలీ చేసింది కోయంబత్తూర్ లోని అదనపు మహిళా న్యాయస్థానం. ఎయిర్ ఫోర్స్ యాక్ట్ 1950 ప్రకారం కోయంబత్తూర్ సిటీ పోలీసులు, ఈ కేసు వ్యవహారాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు అప్పగించాల్సిందిగా […]

ఆ రేప్ కేసు విచారణాధికారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దే..
X

త్రివిధ దళాలు దేశానికి రక్షణనిస్తాయి. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో కేసుల విచారణ కూడా వాటి పరిధిలోకి వెళ్తుంది. ఇలాంటి అరుదైన ఘటనే తమిళనాడులో జరిగింది. బాధితురాలు, నిందితుడు.. ఇద్దరూ ఎయిర్ ఫోర్స్ కి చెందినవారే కావడంతో రేప్ కేసు విచారణను ఐఏఎఫ్ కి బదిలీ చేసింది కోయంబత్తూర్ లోని అదనపు మహిళా న్యాయస్థానం. ఎయిర్ ఫోర్స్ యాక్ట్ 1950 ప్రకారం కోయంబత్తూర్ సిటీ పోలీసులు, ఈ కేసు వ్యవహారాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు అప్పగించాల్సిందిగా అడిషనల్ మహిళా కోర్ట్ ఇన్ చార్జి ఎన్.తిలగేశ్వరి ఉత్తర్వులిచ్చారు. అత్యాచార ఘటన కూడా కోయంబత్తూరులోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో జరగడంతో ఐఏఎఫ్ కి మాత్రమే విచారణాధికారం ఉంటుందని తెలిపారు.

బాధితురాలి కథనం ప్రకారం సెప్టెంబర్ 10న కోయంబత్తూరులోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో అత్యాచార ఘటన జరిగింది. బాధితురాలైన మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, నిందితుడైన ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ అమితేష్ హర్ముఖ్ ఇద్దరూ అక్కడ శిక్షణకోసం వచ్చారు. సెప్టెంబర్ 10న అమితేష్.. తన గదిలోకి వచ్చి తనను రేప్ చేశాడని, ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని బాధితురాలు పోలీస్ కేసు పెట్టింది. కేసు వెనక్కి తీసుకోవాలని తనపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారని కూడా పేర్కొంది. అయితే ఈ మహిళా న్యాయస్థానం, ఈ కేసు విచారణను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అప్పగించింది. ఇలా కేసు బదిలీ చేయడం వల్ల ఎవరికీ అన్యాయం జరగలేదని, కేసు విచారణను సరైన వ్యవస్థకు అప్పగించామని కోర్టు తెలిపింది.

సంచలనంగా మారిన 2-ఫింగర్ టెస్ట్..
రేప్ కేసుల్లో మహిళల కన్యత్వాన్ని నిర్థారించేందుకు గతంలో 2-ఫింగర్ టెస్ట్ చేసేవారు. అయితే ఇది మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలే ఉందనే ఉద్దేశంతో ఇటీవల దీనిపై నిషేధం విధించారు. కానీ సెప్టెంబర్ 10న కోయంబత్తూరులోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో జరిగిన రేప్ వ్యవహారంలో బాధితురాలికి ఎయిర్ ఫోర్స్ ఆస్పత్రిలో 2-ఫింగర్ టెస్ట్ నిర్వహించారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధినేతకు ఈమేరకు ఓ లేఖను రాశారు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ. 2-ఫింగర్ టెస్ట్ ఘటనపై కూడా విచారణ చేపట్టాలని కోరారు.

First Published:  1 Oct 2021 1:28 AM GMT
Next Story