మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రయిలర్ రివ్యూ
“లోకం సర్దుకుపో అంటుంది..మందను వదిలి కొత్తదారిని పట్టుకుని నేను వెళ్తున్నా..మీరూ రండి” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మొత్తం ఈ ఒక్క డైలాగ్ చుట్టూరా తిరుగుతుంది. ఎలాంటి అమ్మాయి కావాలనే అంశంపై ఫుల్ క్లారిటీ ఉందంటాడు హీరో. తనను తాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రకటించుకుంటాడు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో చాలామంది అమ్మాయిల్ని రిజెక్ట్ చేస్తుంటాడు. ఎప్పుడైతే హీరోయిన్ తన లైఫ్ లోకి ఎంటర్ అవుతుందో, అప్పుడు అసలైన పార్టనర్ అంటే ఎలా ఉండాలో అర్థం చేసుకుంటాడు. […]
“లోకం సర్దుకుపో అంటుంది..మందను వదిలి కొత్తదారిని పట్టుకుని నేను వెళ్తున్నా..మీరూ రండి” మోస్ట్
ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మొత్తం ఈ ఒక్క డైలాగ్ చుట్టూరా తిరుగుతుంది. ఎలాంటి అమ్మాయి కావాలనే అంశంపై ఫుల్ క్లారిటీ ఉందంటాడు హీరో. తనను తాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రకటించుకుంటాడు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో చాలామంది అమ్మాయిల్ని రిజెక్ట్ చేస్తుంటాడు.
ఎప్పుడైతే హీరోయిన్ తన లైఫ్ లోకి ఎంటర్ అవుతుందో, అప్పుడు అసలైన పార్టనర్ అంటే ఎలా ఉండాలో
అర్థం చేసుకుంటాడు. అయితే అప్పటికే చేయాల్సిన తప్పులన్నీ చేయడం వల్ల, హీరోయిన్ దృష్టిలో చులకన అవుతాడు. అలా దారితప్పిన తన జీవితాన్ని మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎలా చక్కదిద్దుకున్నాడు, తన ప్రేయసిని ఎలా దక్కించుకున్నాడనే స్టోరీనే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
కాస్త కన్ఫ్యూజ్ చేసినా ట్రయిలర్ లో ఇలా సినిమా స్టోరీని చూచాయగా చెప్పేశారు మేకర్స్. ఈ సినిమాపై
ఇప్పటికే అంచనాలు తగ్గించే ప్రయత్నం జరిగింది. తాజాగా రిలీజైన ట్రయిలర్ తో ఆ అంచనాల్ని సరిగ్గా సెట్ చేశారు అనిపిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది. పూజా హెగ్డే హీరోయిన్.