చిరంజీవిపై పుకారు.. ఈసారి మరింత క్రేజీగా!
చిరంజీవి చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. వీటిలో ఓ సినిమాపై ఓ క్రేజీ పుకారు షికారు చేస్తోంది. బాబి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు సంబంధించిన పుకారు ఇది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా కనిపిస్తాడట. ప్రస్తుతం చిరంజీవి చేతిలో రీమేక్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. బాబి దర్శకత్వంలో చేయబోయే సినిమా మాత్రమే స్ట్రయిట్ మూవీ. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రను రవితేజతో చేయించాలని బాబి ఉబలాటపడుతున్నట్టు […]
చిరంజీవి చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. వీటిలో ఓ సినిమాపై ఓ క్రేజీ పుకారు షికారు చేస్తోంది. బాబి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు సంబంధించిన పుకారు ఇది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా కనిపిస్తాడట.
ప్రస్తుతం చిరంజీవి చేతిలో రీమేక్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. బాబి దర్శకత్వంలో చేయబోయే సినిమా
మాత్రమే స్ట్రయిట్ మూవీ. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రను రవితేజతో చేయించాలని బాబి ఉబలాటపడుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
అప్పుడెప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవితో కలిసి నటించాడు రవితేజ. అన్నయ్య సినిమాలో చిరంజీవికి
తమ్ముడిగా కనిపించాడు. మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవి మూవీలో రవితేజ అంటూ క్రేజీ గాసిప్ బయటకొచ్చింది.
అన్నట్టు రవితేజ-బాబి మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి వర్క్ చేశారు కూడా. ఆ అనుబంధంతో చిరంజీవి
సినిమాలో రవితేజ కోసం బాబి ఓ ట్రాక్ రాసినట్టున్నాడు.