Telugu Global
Cinema & Entertainment

చాలా రోజుల తర్వాత రోడ్ ఫిలిం వస్తోంది

తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ. ఎక్కువగా డ్రామాలే కనిపిస్తుంటాయి. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ లో ఓ రోడ్ ఫిలిం వస్తోంది. ఆ సినిమా పేరు ఇదే మా కథ. ఇందులో హీరోలు ఉండరు. 4 పాత్రలుంటాయి. ఆ 4 పాత్రలు బైక్ జర్నీ స్టార్ట్ చేస్తాయి. ఒకరితో ఒకరికి సంబంధం లేని ఆ పాత్రలు ఏ మలుపు తిరిగాయి, ఏ మజిలీ చేరుకున్నాయి అనేది సినిమా. ఇందులో సుమంత్ అశ్విన్, భూమిక, శ్రీకాంత్, తన్యా హోప్ నటించారు. ఈ […]

చాలా రోజుల తర్వాత రోడ్ ఫిలిం వస్తోంది
X

తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ. ఎక్కువగా డ్రామాలే కనిపిస్తుంటాయి. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ లో ఓ రోడ్ ఫిలిం వస్తోంది. ఆ సినిమా పేరు ఇదే మా కథ. ఇందులో హీరోలు ఉండరు. 4 పాత్రలుంటాయి. ఆ 4 పాత్రలు బైక్ జర్నీ స్టార్ట్ చేస్తాయి. ఒకరితో ఒకరికి సంబంధం లేని ఆ పాత్రలు ఏ మలుపు తిరిగాయి, ఏ మజిలీ చేరుకున్నాయి అనేది సినిమా.

ఇందులో సుమంత్ అశ్విన్, భూమిక, శ్రీకాంత్, తన్యా హోప్ నటించారు. ఈ సినిమా తనకు ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందంటున్నాడు సుమంత్ అశ్విన్. సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షేర్ చేశాడు.

“తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మంచి మంచి లొకేషన్స్ చూపించడం వల్ల అంత
ఎగ్జైట్మెంట్ ఉండదు. కథలో రోల్స్ ఇన్వాల్మెంట్ ఉండాలి. ఇందులో అవన్నీ ఉన్నాయి. కథ చెప్పగానే ఎగ్జైట్ అయ్యాను. అందరికీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏవీ లేవు కానీ శ్రీకాంత్ గారికి ఉంది. లాస్ట్ లో 20 మినిట్స్ మంచు మీద రైడ్, రేస్ ఆసక్తికరంగా ఉంటుంది. మంచు మీద బైక్ నడపడం చాలా రిస్క్. అందుకే మంచు మీద చాలా ప్రాక్టీస్ చేసి షూటింగ్ చేశాం. లక్కీగా ఎవ్వరికీ ఏమీ యాక్సిడెంట్ లాంటివి జరగలేదు.”

ఇలా తన షూటింగ్ అనుభవాల్ని పంచుకున్నాడు సుమంత్ అశ్విన్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 పాటలు సూపర్ హిట్టవ్వడం సినిమాకు ప్లస్ పాయింట్. గురు పవన్ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ
సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తోంది.

First Published:  29 Sept 2021 1:31 PM IST
Next Story