Telugu Global
Cinema & Entertainment

వచ్చే ఏడాది అనుష్క పెళ్లి?

అనుష్క పెళ్లిపై కొన్నేళ్లుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకుంటారనే రూమర్ అయితే దాదాపు దశాబ్దం పాటు నలిగింది. ఆ తర్వాత ఇద్దరూ దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆ వెంటనే ఓ దర్శకుడి కొడుకుతో అనుష్క పెళ్లి అంటూ ఊహాగానాలొచ్చాయి. అవి కూడా పుకార్లుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత దుబాయ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి అంటూ కథనాలు వచ్చాయి. ఇలా ఎప్పటికప్పుడు అనుష్క పెళ్లిపై వార్తలు, ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. కానీ 39 ఏళ్ల […]

వచ్చే ఏడాది అనుష్క పెళ్లి?
X

అనుష్క పెళ్లిపై కొన్నేళ్లుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకుంటారనే రూమర్
అయితే దాదాపు దశాబ్దం పాటు నలిగింది. ఆ తర్వాత ఇద్దరూ దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆ వెంటనే ఓ దర్శకుడి కొడుకుతో అనుష్క పెళ్లి అంటూ ఊహాగానాలొచ్చాయి. అవి కూడా పుకార్లుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత దుబాయ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి అంటూ కథనాలు వచ్చాయి.

ఇలా ఎప్పటికప్పుడు అనుష్క పెళ్లిపై వార్తలు, ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. కానీ 39 ఏళ్ల అనుష్క మాత్రం తన పెళ్లిపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తను అసలు పెళ్లి చేసుకుంటుందా, చేసుకోదా అనే సందేహం కూడా చాలామందిపై ఉంది. దీనిపై తాజాగా ఓ జ్యోతిష్కుడు స్పందించాడు.

బెంగళూరుకు చెందిన పండిత్ జగన్నాధ్ గురూజీ అనుష్క పెళ్లిపై స్పందించారు. ఆమె జాతకాన్ని పూర్తిగా
పరిశీలించానని చెప్పిన జగన్నాధ్.. వచ్చే ఏడాది అనుష్క కచ్చితంగా పెళ్లి చేసుకుంటుందని చెబుతున్నారు. ఒకవేళ, వచ్చే ఏడాది ఆమె పెళ్లి జరక్కపోతే.. 2023లో ఆమె కచ్చితంగా వివాహం చేసుకుంటుందని చెబుతున్నారు. మరి దీనిపై అనుష్క ఏమంటుందో చూడాలి.

First Published:  28 Sept 2021 2:56 PM IST
Next Story