Telugu Global
Cinema & Entertainment

లైగర్ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది

మోస్ట్ హ్యపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బాక్సింగ్‌లో లెజెండ్ మైక్ టైసన్ మొదటిసారిగా ఈ సినిమా ద్వారా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయం కాబోతోన్నారు. ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్, బాక్సింగ్ గాడ్‌, ది లెజెండ్, ది బీస్ట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఐర‌న్ […]

లైగర్ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది
X

మోస్ట్ హ్యపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ లైగర్. పూరి జగన్నాథ్
దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బాక్సింగ్‌లో లెజెండ్ మైక్ టైసన్ మొదటిసారిగా ఈ సినిమా ద్వారా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయం కాబోతోన్నారు.

ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్, బాక్సింగ్ గాడ్‌, ది లెజెండ్, ది బీస్ట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఐర‌న్ మైక్ టైసన్ ను మా సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేయబోతున్నాం అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశాడు. మైక్ టైసన్ ను సాదరంగా ఆహ్వానించాడు.

బాక్సింగ్‌లో తన పంచులతో ఎంతో మంది ప్రత్యర్థులను మట్టికరిపించిన మైక్ టైసన్ ఇప్పుడు లైగర్ చిత్రంలో నటించబోతోన్నాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం కలిగిన ఐరన్ మైక్ పాత్రలో ఆయన కనిపించబోతోన్నారు. ఇక మైక్ టైసన్ రాకతో.. ఈ చిత్రం పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ సినిమాగా మారింది.

ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.

First Published:  27 Sept 2021 2:17 PM IST
Next Story