Telugu Global
Cinema & Entertainment

కొండపొలం మూవీ ట్రయిలర్ రివ్యూ

ఎట్టకేలకు వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండపొలంను బయటకు తీశారు. విడుదలకు సిద్ధం చేశారు. డేట్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఓ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం. హైద్రాబాద్‌లో ఉద్యోగ వేటలో ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లడం, అక్కడ అతనికి అవమానాలు ఎదురవడం కనిపిస్తోంది. ఆయన కుటుంబ నేపథ్యం, గొర్రెల కాపరి కావడం, తల్లిదండ్రులు చదువుకోకపోవడం లాంటి కార‌ణాల‌ను లేవనెత్తి కించపరుస్తుంటారు. కానీ […]

కొండపొలం మూవీ ట్రయిలర్ రివ్యూ
X

ఎట్టకేలకు వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండపొలంను బయటకు తీశారు. విడుదలకు సిద్ధం చేశారు. డేట్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఓ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం.

హైద్రాబాద్‌లో ఉద్యోగ వేటలో ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లడం, అక్కడ అతనికి అవమానాలు ఎదురవడం
కనిపిస్తోంది. ఆయన కుటుంబ నేపథ్యం, గొర్రెల కాపరి కావడం, తల్లిదండ్రులు చదువుకోకపోవడం లాంటి
కార‌ణాల‌ను లేవనెత్తి కించపరుస్తుంటారు. కానీ ఆ వృత్తినే ఎంతో గర్వంగా చెప్పుకుంటాడు. నల్లమల
అడవులన్నీ నాకు తెలుసు..ఇక నేను ఎక్కడకి వెళ్లను..అదే నా ఇన్‌స్టిట్యూషన్ అని ఫిక్స్ అవుతాడు హీరో.

కటారు రవింద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) తన తాత మాట ప్రకారం.. తండ్రితో కలిసి కొండపొలం అనే ఊరికి
వెళ్తాడు. అక్కడ నీటి వసతి ఉండదు. కానీ అక్కడే మేకలు, గొర్రెలను పెంచాలి. క్రూర మృగాల నుంచి వాటిని కాపాడే బాధ్యతను అతను తీసుకుంటాడు. ఇక అక్కడే అతని ప్రేయసి ఓబులమ్మ ప‌రిచ‌య‌మ‌వుతుంది.

అడవిలోని క్రూర మృగాల కంటే ఘోరమైన, దారుణమైన మనుషులుంటారు. వారి వల్ల రవీంద్ర ప్రయాణం ఎంతో కష్టంగా మారుతుంది. వారి నుంచి ఎన్నో ప్రమాదాలు ఎదురవుతుంటాయి. వారితో రవీంద్రకు ఎదురైన పరిస్థితులు ఏంటి? వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేదే కథ. ట్రయిలర్ లో వైష్ణవ్ తేజ్, రకుల్ గెటప్స్, యాక్టింగ్ బాగున్నాయి. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది.

First Published:  27 Sept 2021 2:25 PM IST
Next Story