దసరాకు రెడీ అవుతున్న వరుడు
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై, నాగశౌర్య-రీతువర్మ జంటగా నటిస్తున్న సినిమా వరుడు కావలెను. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. విజయదశమి పర్వదినాన అక్టోబర్ 15న వరుడు కావలెను సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ‘‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా’ అనే పాటతో పాటు.. ‘దిగు దిగు నాగ’, ‘‘మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఊపులో […]
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై, నాగశౌర్య-రీతువర్మ జంటగా నటిస్తున్న సినిమా వరుడు కావలెను.
లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. విజయదశమి
పర్వదినాన అక్టోబర్ 15న వరుడు కావలెను సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ‘‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా’ అనే పాటతో పాటు.. ‘దిగు దిగు నాగ’, ‘‘మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఊపులో రిలీజ్ చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా ఓ మోస్తరు అంచనాలతో దసరాకు థియేటర్లలోకి రాబోతోంది వరుడు కావలెను సినిమా.
ప్రస్తుతం నాగశౌర్య చేతిలో 3 సినిమాలున్నాయి. వరుడు కావలెను సినిమాతో పాటు లక్ష్య అనే మూవీ ఉంది. వీటితోపాటు సొంత బ్యానర్ పై చేస్తున్న సినిమా కూడా ఉంది. వరుడు కావలెను సినిమా నుంచి మొదలుపెట్టి, మినిమం గ్యాప్స్ లో మిగతా మూవీస్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు శౌర్య.