Telugu Global
Cinema & Entertainment

మహాసముద్రం ట్రయిలర్ రివ్యూ

ఆర్ఎక్స్100 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఏ దర్శకుడు గ్యాప్ తీసుకోవాలని అనుకోడు. చకచకా అడ్వాన్సులు తీసుకొని, వరుసపెట్టి సినిమాలు తీస్తాడు. క్రేజ్ ను క్యాష్ చేసుకుంటాడు. కానీ దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఒకే కథ పట్టుకొని చాలామంది హీరోల చుట్టూ తిరిగాడు. అదే కథకు ఫిక్స్ అయ్యాడు. ఇన్నేళ్లలో మరో సినిమా చేయలేదు. అతడు ఎందుకు మహాసముద్రం అనే కథకు అంతలా లాక్ అయిపోయాడో, ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటించిన మహాసముద్రం ట్రయిలర్ […]

మహాసముద్రం ట్రయిలర్ రివ్యూ
X

ఆర్ఎక్స్100 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఏ దర్శకుడు గ్యాప్ తీసుకోవాలని అనుకోడు. చకచకా అడ్వాన్సులు తీసుకొని, వరుసపెట్టి సినిమాలు తీస్తాడు. క్రేజ్ ను క్యాష్ చేసుకుంటాడు. కానీ దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఒకే కథ పట్టుకొని చాలామంది హీరోల చుట్టూ తిరిగాడు. అదే కథకు ఫిక్స్ అయ్యాడు. ఇన్నేళ్లలో మరో సినిమా చేయలేదు. అతడు ఎందుకు మహాసముద్రం అనే కథకు అంతలా లాక్ అయిపోయాడో, ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది.

శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటించిన మహాసముద్రం ట్రయిలర్ ఈరోజు రిలీజైంది. హీరోలు,
హీరోయిన్లతోపాటు కీలక పాత్రలు పోషించిన రావురమేష్, జగపతిబాబు పాత్రలన్నింటినీ వరుసపెట్టి
పరిచయం చేశారు. ట్రయిలర్ చూస్తుంటే.. ప్రతి పాత్రలో లోతు కనిపిస్తోంది. ఏ క్యారెక్టర్ ను లైట్
తీసుకోవడానికి లేదు. దేని అందం దానిదే. ఏ పాత్ర మేనరిజమ్స్ ఆ పాత్రదే. ఓవరాల్ గా ట్రయిలర్ చూస్తే, ఒకప్పటి సముద్రం, అంతఃపురం సినిమాలు గుర్తొస్తాయి.

సిద్దార్థ్, శర్వనంద్, అదితిరావు పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో ట్రయిలర్ తో రుచిచూపించాడు
దర్శకుడు. అను ఎమ్మాన్యుయేల్ పాత్రను మాత్రం పెద్దగా హైలెట్ చేయలేదు. చైతన్ భరధ్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ ట్రయిలర్ లో హైలెట్ గా నిలిచాయి. అక్టోబర్ సెకెండ్ వీక్ లో గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది మహాసముద్రం సినిమా.

First Published:  23 Sept 2021 3:39 PM IST
Next Story