Telugu Global
NEWS

అక్టోబర్ 20 నుంచి షర్మిల పాదయాత్ర..!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ టీపీని నెలకొల్పిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా నిరుద్యోగులకు మద్దతుగా షర్మిల పోరాటం సాగిస్తున్నారు. ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడ్డ వారి ఇళ్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారు.అక్టోబర్ 20వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు […]

అక్టోబర్ 20 నుంచి షర్మిల పాదయాత్ర..!
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ టీపీని నెలకొల్పిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా నిరుద్యోగులకు మద్దతుగా షర్మిల పోరాటం సాగిస్తున్నారు. ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడ్డ వారి ఇళ్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.

తాజాగా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారు.అక్టోబర్ 20వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఉమ్మడి తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ గెలిచి వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు.

రాజశేఖర రెడ్డి తన పాదయాత్రను తెలంగాణలోని చేవెళ్ల నుంచి ప్రారంభించారు. ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని అయినా చేవెళ్ల నుంచి ప్రారంభించడం వైఎస్ కు ఒక సెంటిమెంట్. షర్మిల కూడా తన పాదయాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల ఈ పాదయాత్ర చేపట్టనున్నారు. ఏడేళ్ళ కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబ సభ్యులు పాలిస్తున్న తీరును ప్రజలకు వివరించడంతో పాటు, ప్రజా సమస్యలను కూడా తెలుసుకోనున్నారు. తెలంగాణలోని 90 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర నిర్వహించి తిరిగి చేవెళ్లలోనే పాదయాత్రను ముగించనున్నారు.

First Published:  20 Sept 2021 2:15 PM IST
Next Story