Telugu Global
Cinema & Entertainment

ఈసారి పెద్ద కథ చెబుతున్న కమ్ముల

లవ్ స్టోరీ.. టైటిల్ చూస్తే ఇది ప్రేమకథ అనే విషయం అర్థమౌతుంది. మరీ ముఖ్యంగా శేఖర్ కమ్ముల ప్రేమకథలంటే సున్నితంగా ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, లవర్స్ మధ్య ఇగోలు బేస్ చేసుకొని సినిమాలు తీస్తాడు. అయితే లవ్ స్టోరీని మాత్రం అలా ఊహించుకోవద్దంటున్నాడు కమ్ముల. ప్రేమకథతో పాటు 2 బలమైన పాయింట్స్ ను ఇందులో టచ్ చేశామని చెబుతున్నాడు. “ఈ సినిమాలో రెండు పాయింట్స్ తీసుకున్నాం ఒకటి అబ్బాయి విషయంలో కుల వివక్షత. ఇంకొకటి ఆడ మగ తారతమ్యం. ఈ […]

ఈసారి పెద్ద కథ చెబుతున్న కమ్ముల
X

లవ్ స్టోరీ.. టైటిల్ చూస్తే ఇది ప్రేమకథ అనే విషయం అర్థమౌతుంది. మరీ ముఖ్యంగా శేఖర్ కమ్ముల
ప్రేమకథలంటే సున్నితంగా ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, లవర్స్ మధ్య ఇగోలు బేస్ చేసుకొని సినిమాలు తీస్తాడు. అయితే లవ్ స్టోరీని మాత్రం అలా ఊహించుకోవద్దంటున్నాడు కమ్ముల. ప్రేమకథతో పాటు 2 బలమైన పాయింట్స్ ను ఇందులో టచ్ చేశామని చెబుతున్నాడు.

“ఈ సినిమాలో రెండు పాయింట్స్ తీసుకున్నాం ఒకటి అబ్బాయి విషయంలో కుల వివక్షత. ఇంకొకటి ఆడ
మగ తారతమ్యం. ఈ రెండు విషయాలను సినిమాలో బలంగా చూపించడం జరిగింది. లీడర్ లో అవినీతిని
మాత్రమే హైలెట్ చేశాను. అందులో కులం కోసం పెట్టిన సీన్ చిన్న పార్ట్ వరకు మాత్రమే ఉంటుంది. కానీ దానిపైనే ఒక పూర్తి సినిమా చేద్దామని ఎప్పుడు నుంచో ఉంది. సమాజంలో ఎప్పుడూ ఏదొక సమస్య ఉంటూనే ఉంటుంది అలా చూసి చూసి ఫైనల్ గా రెండు బలమైన పాయింట్స్ తో లవ్ స్టోరీ తీశాను.”

ఇలా లవ్ స్టోరీ సినిమా అసలు పాయింట్ ను బయటపెట్టాడు కమ్ముల. కేవలం దీన్ని ప్రేమకథగా మాత్రమే చూడొద్దని చెబుతున్నాడు. ఇక సాయిపల్లవిపై స్పందిస్తూ.. సాయిపల్లవి మంచి పెర్ఫార్మర్ కాబట్టి ఆమెను తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. పైగా తెలంగాణ అమ్మాయి పాత్రకు సాయిపల్లవి బెస్ట్ ఛాయిస్ అన్నాడు.

ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది లవ్ స్టోరీ. ఫిదా తర్వాత కమ్ముల నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ లవ్ స్టోరీపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు పాటలు సూపర్ హిట్టయ్యాయి.

First Published:  20 Sept 2021 12:41 PM IST
Next Story