Telugu Global
Cinema & Entertainment

వెంకీ సినిమాకు సెన్సార్ పూర్తయింది

వెంకటేష్ కెరీర్‌లో ద‌ృశ్యం సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ దృశ్యం 2 రెడీ అయింది. ఈ మూవీని జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తుండగా.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. దృశ్యం సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో.. సీక్వెల్ మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. త్వరలోనే చిత్రయూనిట్ ఈ […]

వెంకీ సినిమాకు సెన్సార్ పూర్తయింది
X

వెంకటేష్ కెరీర్‌లో ద‌ృశ్యం సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ దృశ్యం 2 రెడీ అయింది. ఈ మూవీని జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తుండగా.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. దృశ్యం సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో.. సీక్వెల్ మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. త్వరలోనే చిత్రయూనిట్ ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.

మొదటి పార్ట్‌లో కనిపించిన మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్ ఇలా అందరూ కూడా సీక్వెల్‌లో
నటిస్తున్నారు. ఇక సంపత్ రాజ్, పూర్ణలు కొత్తగా సీక్వెల్‌లో కనిపించబోతోన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ పార్ట్ ఎంతో ఉంది. వెంకటేష్ నటన అందరినీ మెస్మరేజ్ చేస్తుందని చెబుతున్నారు సురేష్ బాబు.

First Published:  20 Sept 2021 12:43 PM IST
Next Story