పంజాబ్ కొత్త సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ..
పంజాబ్ లో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అమరీందర్ సింగ్ వారసుడిగా చరణ్ జిత్ సింగ్ చన్నీని అధిష్టానం ఖరారు చేసింది. పంజాబ్ సీఎల్పీ నాయకుడిగా 47 ఏళ్ల చరణ్ జిత్ సింగ్ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ హరీశ్ రావత్ ప్రకటించారు. కొత్త సీఎం ఎంపికలో తీవ్ర స్థాయి కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది. ఓ దశలో సుఖ్ జిందర్ పేరు ఖరారైనట్టు వార్తలొచ్చినా చివరకు అధిష్టానం చరణ్ జిత్ సింగ్ పేరు […]
పంజాబ్ లో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అమరీందర్ సింగ్ వారసుడిగా చరణ్ జిత్ సింగ్ చన్నీని అధిష్టానం ఖరారు చేసింది. పంజాబ్ సీఎల్పీ నాయకుడిగా 47 ఏళ్ల చరణ్ జిత్ సింగ్ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ హరీశ్ రావత్ ప్రకటించారు. కొత్త సీఎం ఎంపికలో తీవ్ర స్థాయి కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది. ఓ దశలో సుఖ్ జిందర్ పేరు ఖరారైనట్టు వార్తలొచ్చినా చివరకు అధిష్టానం చరణ్ జిత్ సింగ్ పేరు ప్రకటించింది.
చరణ్ జిత్ సింగ్ చన్నీ, చామ్ కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015-2016 మధ్య అసెంబ్లీలో కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవవహరించారు. అమరీందర్ కేబినెట్ లో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్ జిత్ పేరుని తెరపైకి తేవడం ద్వారా కాంగ్రెస్ సరికొత్త వ్యూహాన్ని రచించినట్టు అర్థమవుతోంది.
మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ మధ్య ఆధిపత్య పోరు హైకమాండ్ కు తలనొప్పిగా మారడంతో పంజాబ్ లో సీఎం మార్పు అనివార్యంగా మారింది. వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు అమరీందర్ ని సీఎం పీఠం నుంచి తప్పించింది. తీవ్ర ఒత్తిడిలో సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్, ఆ తర్వాత సిద్ధూపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవేళ సిద్ధూ పంజాబ్ సీఎం అయితే వినాశనమే మిగులుతుందని హెచ్చరించారు. సీఎంగా ఆయన్ను తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. సిద్ధూకు పాకిస్తాన్ ప్రధానితో, ఆర్మీతో సంబంధాలు ఉన్నాయని, ఇది దేశభద్రతకు పెనుముప్పుగా మారుతుందని హెచ్చరించారు. అమరీందర్, సిద్ధూ మధ్య మాటల యుద్దం కొనసాగుతుండగానే కొత్త నాయకుడిని పంజాబ్ లేజిస్లేటివ్ పార్టీ ఎన్నుకుంది. చరణ్ జిత్ సింగ్ చన్నీ పంజాబ్ 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.