Telugu Global
National

రూ. 20 కోట్లకు పన్ను ఎగ్గొట్టిన సోనూసూద్​..! ఇన్​కమ్​ ట్యాక్స్​ అధికారుల ప్రకటన

కరోనా లాక్​డౌన్​ టైంలో సోనూసూద్​ రియల్ హీరోగా మారిపోయారు. ఎందరో కోవిడ్​ బాధితులను, లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వారికి ఆయన ఆదుకున్నారు. దీంతో సోనూసూద్​ కు విపరీతమైన క్రేజ్​ ఏర్పడిన విషయం తెలిసిందే. సోనూసూద్​ .. రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసించారు. అయితే తాజాగా సోనూసూద్​ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన దాదాపు రూ. 20 కోట్లకు పన్ను ఎగ్గొట్టారని ఇన్​కమ్​ ట్యాక్స్​ అధికారులు ప్రకటించారు. దాతల నుంచి సేకరించిన డబ్బును ఖర్చుపెట్టకుండా తన అకౌంట్​లోనే దాచుకున్నారని […]

రూ. 20 కోట్లకు పన్ను ఎగ్గొట్టిన సోనూసూద్​..! ఇన్​కమ్​ ట్యాక్స్​ అధికారుల ప్రకటన
X

కరోనా లాక్​డౌన్​ టైంలో సోనూసూద్​ రియల్ హీరోగా మారిపోయారు. ఎందరో కోవిడ్​ బాధితులను, లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వారికి ఆయన ఆదుకున్నారు. దీంతో సోనూసూద్​ కు విపరీతమైన క్రేజ్​ ఏర్పడిన విషయం తెలిసిందే. సోనూసూద్​ .. రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసించారు. అయితే తాజాగా సోనూసూద్​ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన దాదాపు రూ. 20 కోట్లకు పన్ను ఎగ్గొట్టారని ఇన్​కమ్​ ట్యాక్స్​ అధికారులు ప్రకటించారు.

దాతల నుంచి సేకరించిన డబ్బును ఖర్చుపెట్టకుండా తన అకౌంట్​లోనే దాచుకున్నారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.సోనూసూద్​ మీద కేంద్ర సర్కారు కక్ష సాధింపు చేస్తోందని కొందరు నెటిజన్లు, శివసేన, ఆప్​ వంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి.
గత మూడు రోజులుగా ఐటీ అధికారులు సోనూసూద్.. ఆయన సన్నిహితుల ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్( రెగ్యులేషన్) యాక్ట్‌ను ఉల్లంఘించారని కూడా అధికారులు పేర్కొన్నారు. క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించినట్లు తెలిపారు.

కొవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో సోనూసూద్‌ ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని ఐటీ అధికారులు వెల్లడించారు. అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని చెప్పారు. ఇటీవల ఢిల్లీ సర్కారు సోనూసూద్ ను విద్యార్థుల కోసం రూపొందించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్​ అంబాసిడర్​గా ప్రకటించింది. ఈ క్రమంలో సోనూ ఇంట్లో ఐటీ దాడులు జరగడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ సోనూసూద్​ కు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వమే కావాలని సోనూసూద్​ ను ఇరికించేందుకు ఐటీ దాడులు నిర్వహిస్తోందంటూ వాళ్లు ఆరోపిస్తున్నారు.

First Published:  18 Sept 2021 10:22 AM
Next Story