Telugu Global
Cinema & Entertainment

ఉపేంద్రతో వర్మ సినిమా నిజమేనా?

సోషల్ మీడియాలో ఏదేదో చెబుతుంటాడు వర్మ. చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన ఉండదు. చాలా సినిమాల్ని ప్రకటించి వదిలేశాడు. పైకి చెప్పని సినిమాల్ని చకచకా పూర్తిచేస్తుంటాడు. ఈ సంగతి పక్కనపెడితే, ఆడియన్స్ లో ఆర్జీవీకి క్రేజ్ పోయి చాలా ఏళ్లు అవుతోంది. అతడి సినిమాలు వస్తున్నాయని, పోతున్నాయనే విషయం కూడా జనాలకు తెలియదు. ఇలాంటి స్థితిలో ఉన్న రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడో క్రేజీ ప్రాజెక్టు ప్రకటించాడు. కన్నడ హీరో ఉపేంద్రతో ఓ సినిమా త్వరలోనే తీస్తానంటున్నాడు. తెలుగు, […]

ఉపేంద్రతో వర్మ సినిమా నిజమేనా?
X

సోషల్ మీడియాలో ఏదేదో చెబుతుంటాడు వర్మ. చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన ఉండదు. చాలా సినిమాల్ని ప్రకటించి వదిలేశాడు. పైకి చెప్పని సినిమాల్ని చకచకా పూర్తిచేస్తుంటాడు. ఈ సంగతి
పక్కనపెడితే, ఆడియన్స్ లో ఆర్జీవీకి క్రేజ్ పోయి చాలా ఏళ్లు అవుతోంది. అతడి సినిమాలు వస్తున్నాయని,
పోతున్నాయనే విషయం కూడా జనాలకు తెలియదు.

ఇలాంటి స్థితిలో ఉన్న రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడో క్రేజీ ప్రాజెక్టు ప్రకటించాడు. కన్నడ హీరో ఉపేంద్రతో ఓ సినిమా త్వరలోనే తీస్తానంటున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా త్వరలోనే మొదలవుతుందని కూడా చెబుతున్నాడు. కానీ ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందనేది అనుమానంగా ఉంది.

కాస్త పేరున్న హీరోలెవ్వరూ ఆర్జీవీతో సినిమా చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇంకా చెప్పాలంటే
రక్తచరిత్ర తర్వాత వర్మతో సినిమా చేయడానికి మరో స్టార్ హీరో ముందుకురాని పరిస్థితి. ఇలాంటి టైమ్ లో
ఉపేంద్రతో సినిమా ప్రకటించిన వర్మ, ఆ సినిమాను ఏ తీరం చేరుస్తాడో చూడాలి.

First Published:  18 Sept 2021 4:50 PM IST
Next Story