పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా..! కొత్త సీఎం ఎవరు?
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు ఆయన రాజీనామా పత్రం సమర్పించారు. అమరీందర్ సింగ్ త్వరలో రాజీనామా చేయబోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అమరీందర్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి లేఖలు రాశారు. ఇదిలా ఉంటే శనివారం కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ సమావేశం నిర్వహించాలని భావించింది. ఈ విషయంపై అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రాజీనామా అనంతరం ఆయన […]
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు ఆయన రాజీనామా పత్రం సమర్పించారు. అమరీందర్ సింగ్ త్వరలో రాజీనామా చేయబోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అమరీందర్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి లేఖలు రాశారు.
ఇదిలా ఉంటే శనివారం కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ సమావేశం నిర్వహించాలని భావించింది. ఈ విషయంపై అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్ఠానం తనను అవమానించిందని చెప్పారు. తన మీద వారికి నమ్మకం లేదని అందుకే రాజీనామా చేశానన్నారు. త్వరలో తన మద్దతు దారులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో ఆయన వేరు కుంపటి పెట్టుకుంటారా? లేక ఏదైనా పార్టీలో చేరతారా? అన్న విషయంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్త సీఎం ఎవరు?
కాంగ్రెస్ కొత్త సీఎంగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ లేదా సునీల్ జాఖా ప్రమాణం చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం పంజాబ్ సీఎల్పీ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతున్నారు. ఇవాళ్టి సమావేశానికి ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని ఇప్పటికే హైకమాండ్ ఆదేశాలు జారీచేసింది.
అయితే ఈ మీటింగ్‌కు అమరీందర్ వర్గీయులు హాజరవుతారా? లేదా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. ఇక పంజాబ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ హరీష్ రావత్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సెప్టెంబర్ 18 కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశం జరగనుంది.. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా పార్టీ ఎమ్మెల్యేలకు ఇదే రకమైన ఆదేశాలు జారీచేశారు. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్ఠానం అమరీందర్ సింగ్‌ను కోరినట్టుగా ఆ వర్గాలు చెప్పాయి. దీంతో పంజాబ్ సీఎం అమరీందర్ రాజీనామా చేసినట్లు తెలిసింది.
గత కొంతకాలంగా సీఎం అమరీందర్‌కు పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు తీవ్ర స్థాయిలో విబేధాలు నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ సైతం పదే పదే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని భావించింది. ఈ పరిణామాలతో అమరీందర్ సింగ్ తీవ్రంగా విసిగిపోయినట్టు టాక్. నవజ్యోత్ సింగ్‌ను కొత్త సీఎంగా నియమించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఏం జరగబోతుందో వేచి చూడాలి.