Telugu Global
Cinema & Entertainment

క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య

కొన్నాళ్ల కిందటి సంగతి. నాగచైతన్యతో దాదాపు సినిమా ప్రకటించడానికి రెడీ అయిపోయాడు దర్శకుడు పరశురామ్. కథ, బ్యానర్ అన్నీ సెట్ అయిపోయాయి. అంతలోనే మహేష్ నుంచి పిలుపురావడం, పరశురామ్ అటు జంప్ అవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి. అలా ఆగిపోయిన సినిమాపై నాగచైతన్య తాజాగా క్లారిటీ ఇచ్చాడు. పరశురామ్ తో చేయాల్సిన సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చాడు చైతూ. మహేష్ తో చేస్తున్న సర్కారువారి పాట సినిమా పూర్తయిన తర్వాత పరశురామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తానని క్లారిటీ ఇచ్చాడు. […]

క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య
X

కొన్నాళ్ల కిందటి సంగతి. నాగచైతన్యతో దాదాపు సినిమా ప్రకటించడానికి రెడీ అయిపోయాడు దర్శకుడు
పరశురామ్. కథ, బ్యానర్ అన్నీ సెట్ అయిపోయాయి. అంతలోనే మహేష్ నుంచి పిలుపురావడం, పరశురామ్ అటు జంప్ అవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి. అలా ఆగిపోయిన సినిమాపై నాగచైతన్య తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

పరశురామ్ తో చేయాల్సిన సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చాడు చైతూ. మహేష్ తో చేస్తున్న సర్కారువారి
పాట సినిమా పూర్తయిన తర్వాత పరశురామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తానని క్లారిటీ ఇచ్చాడు. పరశురామ్ తో
చేయాల్సిన సినిమాకు సంబంధించి కథ-స్క్రీన్ ప్లే మొత్తం లాక్ అయిందని ప్రకటించాడు.

ఇక వెబ్ సిరీస్ అంటూ వస్తున్న ఊహాగానాలపై కూడా స్పందించాడు చైతూ. త్వరలోనే ఓ ఓటీటీ సంస్థకు
వెబ్ సిరీస్ చేయబోతున్న విషయాన్ని ప్రకటించాడు. థ్యాంక్ యూ సినిమా పూర్తయిన వెంటనే దర్శకుడు
విక్రమ్ కుమార్ తో కలిసి ఆ వెబ్ సిరీస్ పూర్తిచేయబోతున్నట్టు తెలిపాడు.

First Published:  16 Sept 2021 2:20 PM IST
Next Story