Telugu Global
Cinema & Entertainment

సోల్ చెడగొట్టలేదు.. ఫీల్ పెంచారంట

తన లేటెస్ట్ మూవీ మాస్ట్రో గురించి ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు హీరో నితిన్. పేరుకు ఇది రీమేక్ సినిమానే అయినప్పటికీ, తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పుచేర్పులు చేశామంటున్నాడు. “దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు. ఉన్నది ఉన్నట్టు తీస్తే ఏం తీశాడురా? అని అంటారు. మార్పులు-చేర్పులు చేస్తే.. సోల్ లేదు చెడగొట్టారు అంటారు. కానీ గాంధీ మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీశారు. హిందీ సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో మన సినిమా […]

సోల్ చెడగొట్టలేదు.. ఫీల్ పెంచారంట
X

తన లేటెస్ట్ మూవీ మాస్ట్రో గురించి ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు హీరో నితిన్. పేరుకు ఇది రీమేక్ సినిమానే అయినప్పటికీ, తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పుచేర్పులు చేశామంటున్నాడు.

“దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు. ఉన్నది ఉన్నట్టు తీస్తే ఏం తీశాడురా? అని
అంటారు. మార్పులు-చేర్పులు చేస్తే.. సోల్ లేదు చెడగొట్టారు అంటారు. కానీ గాంధీ మాత్రం తెలుగు
ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీశారు. హిందీ సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో మన సినిమా కూడా అంత
బాగుందని అనుకుంటారు. సోల్ చెడగొట్టకుండా, ఫీల్ పెంచి మరీ తీశాడు.”

మాస్ట్రో సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. అయినప్పటికీ దీనికి గట్టిగా ప్రమోషన్ చేస్తున్నాడు నితిన్. మిగతా హీరోలకు భిన్నంగా ఏకంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా పెట్టాడు.

“ఈ సినిమాకు క్యాస్టింగ్ చాలా ముఖ్యం. విలన్ కోసం జిషును తీసుకున్నాం. టబు పాత్రకు చాలా మందిని
అనుకున్నాం. కానీ తమన్నా ఒప్పుకుంటుందా? లేదా? అనుకున్నాం. మంగ్లీ యాక్టింగ్ చూసి సింగరా?
యాక్టరా? అని షాక్ అయ్యాను. ఇకపై ఆమె సింగర్‌గా పక్కకెళ్లి.. యాక్టర్‌గా బిజీగా అవుతుంది.”

హిందీలో హిట్టయిన అంధాధూన్ సినిమాకు రీమేక్ గా వస్తోంది మాస్ట్రో. ఈ శుక్రవారం డిస్నీ హాట్ స్టార్ లో
స్ట్రీమింగ్ కు రానుంది.

First Published:  15 Sept 2021 2:49 PM IST
Next Story