Telugu Global
Cinema & Entertainment

హిట్టా, ప్లాపా అనేది ఫోన్ చెప్పేస్తుంది

తన సినిమా హిట్టా, ఫ్లాప్ అనే విషయాన్ని తన ఫోన్ చెప్పేస్తుందని అంటున్నాడు హీరో గోపీచంద్. సినిమా హిట్టయితే తన ఫోన్ అదేపనిగా మోగుతుందని, ఫ్లాప్ అయితే సౌండ్ పెద్దగా రాదని అన్నాడు. “నేను జెన్యూన్‌గా హిట్ అనే మాట విని చాలా కాల‌మైంది. అంత‌కుముందు హిట్స్ వ‌చ్చాయి. ఈ మ‌ధ్య కాలంలో నా సినిమాల‌ను హిట్ అని విన్లేదు. కానీ ఈ సినిమా కొర‌త తీర్చేసింది. నేను హిట్స్‌, ప్లాప్స్ చూశాను. నా సినిమా హిట్టా, ప్లాపా […]

హిట్టా, ప్లాపా అనేది ఫోన్ చెప్పేస్తుంది
X

తన సినిమా హిట్టా, ఫ్లాప్ అనే విషయాన్ని తన ఫోన్ చెప్పేస్తుందని అంటున్నాడు హీరో గోపీచంద్. సినిమా
హిట్టయితే తన ఫోన్ అదేపనిగా మోగుతుందని, ఫ్లాప్ అయితే సౌండ్ పెద్దగా రాదని అన్నాడు.

“నేను జెన్యూన్‌గా హిట్ అనే మాట విని చాలా కాల‌మైంది. అంత‌కుముందు హిట్స్ వ‌చ్చాయి. ఈ మ‌ధ్య
కాలంలో నా సినిమాల‌ను హిట్ అని విన్లేదు. కానీ ఈ సినిమా కొర‌త తీర్చేసింది. నేను హిట్స్‌, ప్లాప్స్ చూశాను. నా సినిమా హిట్టా, ప్లాపా అని నా ఫోన్ చెప్పేస్తుంది. ఇంకొక‌రు చెబితే నేను విన‌ను. హిట్ సౌండ్ ఎలా ఉంటుంది? ప్లాప్ సౌండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు.”

సీటీమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనక జరిగిన కథను బయటపెట్టాడు గోపీచంద్. నిజానికి సీటీమార్ కంటే ముందు మరో స్టోరీలైన్ అనుకున్నారట. కానీ దాన్ని పక్కనపెట్టి సీటీమార్ తీశారట.

“సీటీమార్ కంటే ముందు ఒక స్టోరీ అనుకున్నాం. కానీ వ‌ర్క‌వుట్ కాద‌నుకున్నాం. 2 నెల‌ల త‌ర్వాత సంప‌త్ సీటీమార్ స్టోరీతో వ‌చ్చాడు. చాలా మంచి స్టోరీ కుదిరింద‌ని అనుకున్నాను. చాలా డిస్క‌స్ చేసుకున్నాం. మ‌ధ్య‌లో పాండ‌మిక్ వ‌చ్చింది. ఈ గ్యాప్‌లో సంప‌త్ స్టోరీని ఇంకా బెట‌ర్‌గా మార్చాడు. ఈ సినిమా అయితే చాలా క‌ష్ట‌మైపోతుంద‌నే భ‌యం ఇద్ద‌రికీ ఉండేది. కానీ ఏమైనా ఈ సినిమా మిస్ కాకూడ‌ద‌ని అనుకున్నాం. కష్టమైనప్పటికీ కలిసి చేశాం.”

ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది సీటీమార్ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో
ఆక్యుపెన్సీ పెద్దగా లేనప్పటికీ ఈ సినిమాకు మంచి మౌత్ టాక్ ఉంది.

First Published:  15 Sept 2021 2:48 PM IST
Next Story