Telugu Global
NEWS

వయోవృద్ధులకు శ్రీవారి ఉచిత శీఘ్ర దర్శనం.. టీటీడీ నిర్ణయం..!

తిరుమల తిరుపతి దేవస్థానం వయోవృద్ధులకు ఉచితంగా శీఘ్ర దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ప్రతి రోజు ఉదయం.. 10 గంటల తర్వాత సాయంత్రం 3 గంటల తర్వాత వయో వృద్ధులకు ఉచిత శీఘ్ర దర్శనం కల్పించనున్నారు. ఈ సమయంలో అన్ని క్యూలైన్లు ఆపేస్తారు. కేవలం వృద్ధులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. దీంతో వారికి చాలా తొందరగా దర్శనం కలుగుతుంది. అయితే ఇందుకోసం వృద్ధులు కొన్ని ఆధారాలను ఎస్​ 1 కౌంటర్​ దగ్గర చూపించాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. […]

వయోవృద్ధులకు శ్రీవారి ఉచిత శీఘ్ర దర్శనం.. టీటీడీ నిర్ణయం..!
X

తిరుమల తిరుపతి దేవస్థానం వయోవృద్ధులకు ఉచితంగా శీఘ్ర దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ప్రతి రోజు ఉదయం.. 10 గంటల తర్వాత సాయంత్రం 3 గంటల తర్వాత వయో వృద్ధులకు ఉచిత శీఘ్ర దర్శనం కల్పించనున్నారు. ఈ సమయంలో అన్ని క్యూలైన్లు ఆపేస్తారు. కేవలం వృద్ధులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. దీంతో వారికి చాలా తొందరగా దర్శనం కలుగుతుంది.

అయితే ఇందుకోసం వృద్ధులు కొన్ని ఆధారాలను ఎస్​ 1 కౌంటర్​ దగ్గర చూపించాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. గతంలో కూడా వృద్ధులకు ప్రత్యేక దర్శనం ఉండేది. అయితే కరోనా లాక్ డౌన్ అమల్లోకి వచ్చాక ఈ సదుపాయాన్ని తొలగించారు. తాజాగా ఈ విధానాన్ని మళ్ళీ అమల్లోకి తెచ్చారు.

ఆలయానికి కుడి పక్కన ఉన్న బ్రిడ్జి కింద వృద్ధుల కోసం ప్రత్యేకంగా దర్శన మార్గాన్ని ఏర్పాటు చేశారు. దర్శనం సమయంలో వృద్ధులకు సాంబర్​ అన్నం, పెరుగన్నం, వేడిపాలు ఉచితంగా అందించనున్నారు. వారికి రూ. 20కి రెండు లడ్డూలు ఇస్తారు. అంతేకాక రూ. 25 చొప్పున ఎన్ని టోకెన్లు అయినా తీసుకొని వారు లడ్డూలు కొనుగోలు చేయవచ్చు.

గుడి నుంచి లడ్డూ కౌంటర్​కు వెళ్లేందుకు బ్యాటరీ కార్లు అందుబాటులో ఉంచారు. ఇందులో వారు ఉచితంగా ప్రయాణించవచ్చు. తిరుమలలో వృద్ధులు దర్శనం చేసుకొనేందుకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నది. టీటీడీ నిర్ణయం పట్ల వయో వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ప్రస్తతం తీసుకున్న నిర్ణయం పట్ల వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  15 Sept 2021 1:06 PM IST
Next Story