ఏపీ సీఎం జగన్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన సీబీఐ కోర్టు.. !
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న సీఎం జగన్, ఎంపీ విజయ్ సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని.. విచారణను వేగవంతం చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు ఉన్న సీబీఐ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. అప్పటి నుంచి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. సీఎం జగన్ […]
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న సీఎం జగన్, ఎంపీ విజయ్ సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని.. విచారణను వేగవంతం చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు ఉన్న సీబీఐ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. అప్పటి నుంచి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
సీఎం జగన్ ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ తన పిటిషన్లో ఆరోపించారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు.
రఘురామకు మరోషాక్..!
ఏపీ సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లను సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరణ తెలిపింది. రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.