Telugu Global
NEWS

యూపీ: కాంగ్రెస్​ కొత్త స్కెచ్​.. సీఎం అభ్యర్థిగా ప్రియాంక

దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్​ పార్టీ ఆపసోపాలు పడుతోంది. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్​ .. గత కొన్నేళ్లుగా బలహీనపడిన విషయం తెలిసిందే. ఓ వైపు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేక గాలులు వీస్తున్నప్పటికీ దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్​ విఫలమవుతూ వస్తున్నది. దీంతో ప్రాంతీయ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే యూపీలో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్​ ఎంతో కాలంగా ప్రయత్నిస్తోంది. గాంధీ కుటుంబానికి సొంత రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్​ బలపడలేక పోతున్నది. […]

యూపీ: కాంగ్రెస్​ కొత్త స్కెచ్​.. సీఎం అభ్యర్థిగా ప్రియాంక
X

దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్​ పార్టీ ఆపసోపాలు పడుతోంది. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్​ .. గత కొన్నేళ్లుగా బలహీనపడిన విషయం తెలిసిందే. ఓ వైపు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేక గాలులు వీస్తున్నప్పటికీ దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్​ విఫలమవుతూ వస్తున్నది. దీంతో ప్రాంతీయ పార్టీలు దూసుకుపోతున్నాయి.

ఇదిలా ఉంటే యూపీలో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్​ ఎంతో కాలంగా ప్రయత్నిస్తోంది. గాంధీ కుటుంబానికి సొంత రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్​ బలపడలేక పోతున్నది. ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక సమాజ్​వాద్​ పార్టీ.. బహుజన్​ సమాజ్​వాద్​ పార్టీ కూడా బలంగానే ఉన్నాయి. కాంగ్రెస్​ ఇక్కడ నాలుగో స్థానంలో ఉంది. కాంగ్రెస్​కు మద్దతుగా నిలబడే.. ముస్లింలు, దళితులు దూరం కావడంతో ఇక్కడ కాంగ్రెస్​ డీలా పడింది.

ఇక బీజేపీ హిందూత్వ ఓట్లతో బలం పుంజుకున్నది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్​ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ప్రియాంకా గాంధీని.. యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాంగ్రెస్​ సీనియర్​ నేత సల్మాన్​ ఖుర్షీద్​ కూడా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.ఇందుకు తగ్గట్టుగానే చాలా రోజులుగా ప్రియాంకా గాంధీ.. యూపీపై ఫోకస్​ పెట్టారు. త్వరలో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేయబోతున్నట్టు సమాచారం. మరి కాంగ్రెస్​ పార్టీ వేసిన ఈ ఎత్తుగడ ఏమైనా ఫలితాలు ఇస్తుందేమో వేచి చూడాలి.

First Published:  14 Sept 2021 4:50 PM IST
Next Story