Telugu Global
Cinema & Entertainment

రీమేక్ సినిమాకు దర్శకుడు మార్పులు

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కింది అంధాధూన్. నితిన్-నభా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సినిమా అవకాశం తనకు రావడాన్ని అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు మేర్లపాక. “అరకు దగ్గరలోని టైడా అనే ఊరిలో మొదటిసారి ఈ ‘అందాధున్’ సినిమా చూశా. ‘అందాధున్’ చూడగానే మూవీలోని థ్రిల్లింగ్ మూమెంట్స్ నచ్చాయి. క్రైం, డార్క్ హ్యూమర్ బాగా నచ్చాయి. రీమేక్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలని అనిపించింది. అనుకోకుండా నితిన్, […]

రీమేక్ సినిమాకు దర్శకుడు మార్పులు
X

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కింది అంధాధూన్. నితిన్-నభా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సినిమా అవకాశం తనకు రావడాన్ని అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు మేర్లపాక.

“అరకు దగ్గరలోని టైడా అనే ఊరిలో మొదటిసారి ఈ ‘అందాధున్’ సినిమా చూశా. ‘అందాధున్’ చూడగానే మూవీలోని థ్రిల్లింగ్ మూమెంట్స్ నచ్చాయి. క్రైం, డార్క్ హ్యూమర్ బాగా నచ్చాయి. రీమేక్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలని అనిపించింది. అనుకోకుండా నితిన్, సుధాకర్ రెడ్డి గారు అప్రోచ్ కావడంతో వెంటనే రీమేక్ చేసేందుకు ఒప్పుకున్నాను.”

చేసింది రీమేక్ అయినప్పటికీ కొన్ని కీలక మార్పులు చేశామంటున్నాడు మేర్లపాక. అయితే ఫీల్ చెడకూడదనే ఉద్దేశంతో కొన్ని సీన్స్ ను మాత్రం మక్కికిమక్కి దించినట్టు చెప్పుకొచ్చాడు.

“ఈ సినిమా ఒరిజినల్ వర్షన్‌లోని లవ్ స్టోరీలో, క్లైమాక్స్‌లో కొన్ని మార్పులు చేశాం. బేసిక్‌గా రీమేక్ సినిమా చేయడం కొంచెం కష్టం. ఉన్నది ఉన్నట్లుగా తీస్తే కాపీ పేస్ట్ అంటారు. ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. ఆ సమస్య అయితే ప్రధానంగా ఉంటుంది. అందుకే ఒరిజినల్ వర్షన్‌లో ఆ ఫీల్ మిస్ కాకూడదని ఉన్న కొన్ని ఫ్రేమ్స్ ఉన్నవి ఉన్నట్లుగా చేశాం.”

నితిన్ అంధుడిగా నటించిన ఈ సినిమాలో తమన్న విలన్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా తనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకొస్తుందని చెబుతున్నాడు నితిన్.

First Published:  14 Sept 2021 3:30 PM IST
Next Story