Telugu Global
NEWS

ఇంటి ప్లాన్ లో చార్జింగ్ పాయింట్ కూడా కీలకమే..

అపార్ట్ మెంట్లయినా, ఆఫీస్ లు అయినా నిర్మాణ అనుమతులు కావాలంటే పార్కింగ్ ఏరియా కచ్చితంగా చూపించాలి. ఇలాంటి కొన్ని నిబంధనలకు ఇప్పుడు చార్జింగ్ పాయింట్ అనేది కూడా తోడవబోతోంది. అవును, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు నిర్మాణ అనుమతుల్లో చార్జింగ్ పాయింట్ కచ్చితంగా చూపించాల్సిందేనని అంటున్నాయి బ్రిటన్ అధికార వర్గాలు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి బ్రిటన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తోంది. దీని ప్రకారం ఇకపై నిర్మించే కొత్త ఇళ్లు, ఆఫీసులకు.. విద్యుత్తు వాహనాలకు […]

ఇంటి ప్లాన్ లో చార్జింగ్ పాయింట్ కూడా కీలకమే..
X

అపార్ట్ మెంట్లయినా, ఆఫీస్ లు అయినా నిర్మాణ అనుమతులు కావాలంటే పార్కింగ్ ఏరియా కచ్చితంగా చూపించాలి. ఇలాంటి కొన్ని నిబంధనలకు ఇప్పుడు చార్జింగ్ పాయింట్ అనేది కూడా తోడవబోతోంది. అవును, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు నిర్మాణ అనుమతుల్లో చార్జింగ్ పాయింట్ కచ్చితంగా చూపించాల్సిందేనని అంటున్నాయి బ్రిటన్ అధికార వర్గాలు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి బ్రిటన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తోంది. దీని ప్రకారం ఇకపై నిర్మించే కొత్త ఇళ్లు, ఆఫీసులకు.. విద్యుత్తు వాహనాలకు అవసరమైన ఛార్జర్లు తప్పని సరి. స్మార్ట్‌ ఛార్జింగ్‌ పరికరాలను ఉంచడానికి సరైన స్థలం, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. వాహనాలు పార్కింగ్‌ చేయగానే ఇవి ఆటోమేటిక్‌గా ఛార్జింగ్‌ చేస్తాయి. ఆఫీసుల్లోని పార్కింగ్‌ ప్లేస్ లలో కూడా ఇవి తప్పనిసరి. ప్రతి ఐదు పార్కింగ్‌ ప్లేస్ లకు ఒక కామన్ చార్జింగ్ పాయింట్ ఉండేలా నిబంధనలు రూపొందించారు.

కొత్త ఇళ్లకు ఛార్జింగ్‌ పాయింట్లను తప్పని సరి చేసిన తొలిదేశంగా బ్రిటన్ నిలవబోతోంది. 2019లో తొలిసారి ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే అప్పట్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా పెద్దగా లేవు. ఇప్పుడు వాహనాల తయారీ, వినియోగం భారీగా పెరగడంతో బ్రిటన్ ఈ ప్రతిపాదనను అమలులో పెడుతోంది. 2030 నుంచి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే వాహనాలను బ్రిటన్ లో నిషేధించబోతున్నారు. అక్కడ కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

భారత్ లో కూడా పెను మార్పులు..
వాహనాల్లో పెట్రోల్, డీజిల్ వాడకానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి భారత్ కూడా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఆమధ్య గ్యాస్ తో నడిచే వాహనాలు వచ్చినా, సరైన ఫిల్లింగ్ స్టేషన్లు లేకపోవడం, వాటి నిర్వహణ భారం కావడం, ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉండటంతో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. పెట్రోల్, డీజిల్ వాహనాలు తయారు చేసే కంపెనీలు కూడా ఈ రంగంపై దృష్టిసారించాయి. అయితే చార్జింగ్ పాయింట్లదే అసలు సమస్య. ప్రతి ఇంటిలో పార్కింగ్ సౌకర్యం ఉంటుంది కానీ, దానికి అనుగుణంగా చార్జింగ్ పాయింట్ ని వేరుగా ఏర్పాటు చేసుకోవాలి. అద్దె ఇళ్ల అవస్థలు ఉన్నవారికి ఇలాంటి సౌకర్యం మరింత కష్టంగా ఉంటుంది. ఇక పబ్లిక్ చార్జింగ్ పాయింట్లు కూడా భారత్ లో పెద్దగా అందుబాటులో లేవు. స్పీడ్ చార్జింగ్ ఉంటే మరింత వెసులుబాటు ఉంటుంది. ఈ మార్పులన్నీ త్వరలోనే వస్తాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగితే భారత్ లో కూడా ఇళ్లు, ఆఫీస్ ల నిర్మాణ ప్లాన్ లో చార్జింగ్ పాయింట్లను కూడా చూపించాల్సి వస్తుంది.

First Published:  13 Sept 2021 3:35 AM IST
Next Story