Telugu Global
Cinema & Entertainment

పక్కా కమ్ముల మార్కు సినిమా

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న లవ్ స్టోరీ సినిమాలో ఎట్టకేలకు సందడి వచ్చింది. ఈ సినిమాను 24న విడుదల చేయబోతున్నట్టు ఈమధ్య ప్రకటించారు. అయితే చాలామంది ఆ విషయాన్ని నమ్మలేదు. ఎప్పట్లానే సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతుందని అనుకున్నారు. కానీ మేకర్స్ మాత్రం 24 రిలీజ్ కు ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు థియేట్రికల్ ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు. పక్కా శేఖర్ కమ్ముల మార్కుతో రిలీజైంది లవ్ స్టోరీ ట్రయిలర్. డైలాగ్స్, టేకింగ్, క్యారెక్టరైజేషన్స్ ఇలా ప్రతి ఎలిమెంట్ […]

పక్కా కమ్ముల మార్కు సినిమా
X

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న లవ్ స్టోరీ సినిమాలో ఎట్టకేలకు సందడి వచ్చింది. ఈ సినిమాను 24న
విడుదల చేయబోతున్నట్టు ఈమధ్య ప్రకటించారు. అయితే చాలామంది ఆ విషయాన్ని నమ్మలేదు.
ఎప్పట్లానే సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతుందని అనుకున్నారు. కానీ మేకర్స్ మాత్రం 24 రిలీజ్ కు ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు థియేట్రికల్ ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు.

పక్కా శేఖర్ కమ్ముల మార్కుతో రిలీజైంది లవ్ స్టోరీ ట్రయిలర్. డైలాగ్స్, టేకింగ్, క్యారెక్టరైజేషన్స్ ఇలా ప్రతి ఎలిమెంట్ లో కమ్ముల మార్కు కనిపించింది. నాగచైతన్య లాంటి స్టార్ హీరోను పెట్టిన తర్వాత కాస్త ఫ్లేవర్ మారుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ట్రయిలర్ చూస్తే, కమ్ముల స్టయిల్ లోకి నాగచైతన్య వచ్చినట్టు కనిపించింది తప్ప, చైతూ కోసం కమ్ముల మారలేదనే విషయం అర్థమౌతోంది.

ఇక సినిమా స్టోరీలైన్ ఏంటనే విషయాన్ని ట్రయిలర్ లో క్లియర్ గా చెప్పేశారు. ఇక మిగిలిందంతా ఎమోషన్ ఎలా క్యారీ అయిందనే విషయం మాత్రమే. కమ్ముల బలమే ఇది కాబట్టి, లవ్ స్టోరీ సినిమా ఓ మంచి ఎమోషనల్ జర్నీగా మారే అవకాశాలు చాలానే ఉన్నాయి.

First Published:  13 Sept 2021 4:19 PM IST
Next Story