Telugu Global
Cinema & Entertainment

రోడ్డు పక్కన టిఫిన్ చేసిన బన్నీ

స్టార్ హీరోలు టిఫిన్ లేదా భోజనం చేయాలంటే స్టార్ హోటల్స్ కు వెళ్లాల్సిందే. లేదంటే ఇంటి నుంచి క్యారియర్ అయినా రావాల్సిందే. ఈ రెండు ఆప్షన్లు కాకుండా మరో ఆప్షన్ ఎక్కడా లేదు. కనీసం సెట్స్ లో ప్రొడక్షన్ భోజనం కూడా టచ్ చేయరు హీరోలు. అలాంటి స్టార్ హీరోలు ఓ చిన్న కాకా హోటల్ లో టిఫిన్ చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇది అలాంటి ఘటనే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రంపచోడవరం దగ్గర్లో […]

రోడ్డు పక్కన టిఫిన్ చేసిన బన్నీ
X

స్టార్ హీరోలు టిఫిన్ లేదా భోజనం చేయాలంటే స్టార్ హోటల్స్ కు వెళ్లాల్సిందే. లేదంటే ఇంటి నుంచి
క్యారియర్ అయినా రావాల్సిందే. ఈ రెండు ఆప్షన్లు కాకుండా మరో ఆప్షన్ ఎక్కడా లేదు. కనీసం సెట్స్ లో
ప్రొడక్షన్ భోజనం కూడా టచ్ చేయరు హీరోలు. అలాంటి స్టార్ హీరోలు ఓ చిన్న కాకా హోటల్ లో టిఫిన్ చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇది అలాంటి ఘటనే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రంపచోడవరం దగ్గర్లో ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప్ సినిమాకు
సంబంధించి అక్కడ షూటింగ్ చేస్తున్నాడు బన్నీ. ఈ క్రమంలో షూటింగ్ కోసం గోకవరం మీదుగా వెళ్తున్న
క్రమంలో దారిలో ఉన్న ఓ చిన్న కాకా హోటల్ దగ్గర ఆగాడు బన్నీ.

సాదాసీదాగా రోడ్డు పక్కన ఉన్న హోటల్ అది. ఇంకా చెప్పాలంటే దాన్ని హోటల్ అనే కంటే ఇడ్లీ బండి
అనడం కరెక్ట్. అలాంటి చోట బన్నీ ఆగాడు. ఎంచక్కా ఆ పాకలోకి వెళ్లి టిఫిన్ చేశాడు. బయటకొచ్చి తన
అసిస్టెంట్ ను అడిగి డబ్బులు తీసుకొని హోటల్ ఓనర్ చేతిలో పెట్టాడు.

ఊహించని విధంగా బన్నీ తన హోటల్ కు రావడంం టిఫిన్ చేసి వెళ్లడంతో హోటల్ ఓనర్ షాక్ కు
గురయ్యాడు. అతడింకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్
అవుతోంది.

First Published:  13 Sept 2021 3:54 PM IST
Next Story