Telugu Global
NEWS

తెలంగాణలో కొత్త ఎయిర్​పోర్టుల ఏర్పాటుకు సహకరిస్తాం.. సింథియా

తెలంగాణలో ప్రతిపాదిత 6 ఎయిర్​పోర్టుల నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఇవాళ ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. సింధియా తెలంగాణ పర్యటనకు రావడంతో సీఎం కేసీఆర్​.. ఆయనను భోజనానికి ఆహ్వానించారు. అనంతరం వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. హైదరాబాద్​ ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్నందున వివిధ దేశాలకు హైదరాబాద్​ నుంచి […]

తెలంగాణలో కొత్త ఎయిర్​పోర్టుల ఏర్పాటుకు సహకరిస్తాం.. సింథియా
X

తెలంగాణలో ప్రతిపాదిత 6 ఎయిర్​పోర్టుల నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఇవాళ ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. సింధియా తెలంగాణ పర్యటనకు రావడంతో సీఎం కేసీఆర్​.. ఆయనను భోజనానికి ఆహ్వానించారు. అనంతరం వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు.

హైదరాబాద్​ ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్నందున వివిధ దేశాలకు హైదరాబాద్​ నుంచి కనెక్టివిటీని మరింత పెంచాలని సీఎం కేసీఆర్​.. కేంద్ర మంత్రిని కోరారు. బిజినెస్ హబ్‌గా, ఐటీ హబ్‌గా, హెల్త్ హబ్‌గా, టూరిజం హబ్‌గా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ఇంకా విస్తరిస్తుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, పలు అంతర్జాతీయ నగరాల నుంచి ప్రయాణికులు వస్తున్నందున సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, యూఎస్ లకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కనెక్టివిటీని పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి సింధియా దృష్టికి తీసుకొచ్చారు.

శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో సేవలను పొడిగించాలని ఆయన కోరారు.
శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వరంగల్ (మామునూరు) ఎయిర్ పోర్టు అథారిటీ లాండ్ (ఏఐ) ఏటీఆర్ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. నిజామాబాద్ జిల్లా (జక్రాన్‌పల్లి)లో ఎయిర్ పోర్టుకు సంబంధించిన టెక్నికల్ క్లియరెన్స్ ఇస్తామన్నారు.

ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టును ఎయిర్‌ఫోర్స్ ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని తమ మంత్రిత్వశాఖ ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు. పెద్దపల్లి (బసంత్ నగర్), కొత్తగూడెం, మహబూబ్ నగర్ (దేవరకద్ర) ఎయిర్‌పోర్టుల్లో చిన్న విమానాలు వచ్చిపోయేలా చేస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు.

First Published:  11 Sept 2021 4:14 PM IST
Next Story