మూడ్ ను మార్చే ఫుడ్స్ ఇవీ!
‘యు ఆర్ వాట్ యు ఈట్’ అని ఇంగ్లీష్ లో ఒక నానుడి ఉంది. అంటే మనం ఏది తింటామో అదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. అంటే మనం తినే తిండి కేవలం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ఆహారాన్ని ఎంచుకునేటప్పుడు అది మనల్ని మానసికంగా ఏ మేరకు ప్రభావితం చేస్తుందో తెలుసుకుని తినాలి. కోపం, సంతోషం, బాధ, డిప్రెషన్.. ఇలా ప్రతి ఎమోషన్ కి.. మనం తినే […]
‘యు ఆర్ వాట్ యు ఈట్’ అని ఇంగ్లీష్ లో ఒక నానుడి ఉంది. అంటే మనం ఏది తింటామో అదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. అంటే మనం తినే తిండి కేవలం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ఆహారాన్ని ఎంచుకునేటప్పుడు అది మనల్ని మానసికంగా ఏ మేరకు ప్రభావితం చేస్తుందో తెలుసుకుని తినాలి.
కోపం, సంతోషం, బాధ, డిప్రెషన్.. ఇలా ప్రతి ఎమోషన్ కి.. మనం తినే ఫుడ్‌తో ఎంతోకొంత సంబంధం ఉంటుంది. కొన్ని ఆహారాలు మెదడులో కోపాన్ని పెంచే హార్మోన్లకు ఎక్కువగా రిలీజ్ చేస్తే మరికొన్ని హ్యాపీ హార్మోన్లను రిలీజ్ చేస్తాయి. అలాగే తిన్న ఆహారం ఏ మేరకు జీర్ణమవుతుంది అనే దాన్ని బట్టి కూడా మన మూడ్స్ మారుతూ ఉంటాయి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకున్నప్పుడు మెదడులో డోపమైన్, సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్లను రిలీజ్ అవుతాయి. అదే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అది సరిగ్గా డైజెస్ట్ అవ్వక మగతగా అనిపిస్తుంది. మన మూడ్ స్వింగ్స్ ను బట్టి ఏయే సందర్భాల్లో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలంటే..
ఎప్పుడైనా మనసులో డిప్రెషన్‌గా అనిపించినప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ ఫంక్షనింగ్కి సపోర్ట్ చేస్తాయి. అందుకే డ్రిపెషన్ గా అనిపించినప్పుడు వాల్ నట్స్, అవిసె గింజలు, సాల్మన్ ఫిష్ లాంటివి తినాలి. వీటిలో ఉండే ఫోలేట్, మెలటోనిన్, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు పనితీరుని మెరుగుపరచి డిప్రెషన్‌ని కంట్రోల్ చేయడంతో సాయపడతాయి.
ఇకపోతే మనసులో కలతగా అనిపించినప్పుడు బీన్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఇందులో ఉండే జింక్, కాపర్, మాంగనీస్, విటమిన్– బి1, బి6, షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసి మూడ్ స్వింగ్స్ ను అడ్డుకుంటాయి. అలాగే ప్రొబయాటిక్ ఫుడ్స్, డార్క్ చాక్లెట్ కూడా డిప్రెషన్ ను తగ్గించడానికి సాయపడతాయి.
మనసు ఎప్పుడూ ప్రశాతంగా ఉండాలని కోరుకునే వారు వీలైనంత వరకూ కూరగాయలు, ధాన్యాలు లాంటి హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ను ఎంచుకోవాలి.
మనసులో కలతగా అనిపించినప్పుడు షుగర్ జోలికి అస్సలు వెళ్లకూడదు. షుగర్ లెవల్స్ వల్ల బ్రెయిన్ మరింత మందగిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతత కోరుకునే వారు కెఫిన్ ను కూడా వీలైనంత వరకూ దూరం పెట్టడం మంచిది.