Telugu Global
Cinema & Entertainment

లవ్ స్టోరీకి మరో విడుదల తేదీ

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇంకా చెప్పాలంటే ఏడాదిన్నరగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. రీసెంట్ గా కూడా ఓసారి రిలీజ్ డేట్ ప్రకటించి వెనక్కి తగ్గారు. అయితే ఈసారి మాత్రం లవ్ స్టోరీ మేకర్స్ తమ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈనెల 24న లవ్ స్టోరీ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. తాజా […]

లవ్ స్టోరీకి మరో విడుదల తేదీ
X

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
సినిమా విడుదల ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇంకా చెప్పాలంటే ఏడాదిన్నరగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. రీసెంట్ గా కూడా ఓసారి రిలీజ్ డేట్ ప్రకటించి వెనక్కి తగ్గారు.

అయితే ఈసారి మాత్రం లవ్ స్టోరీ మేకర్స్ తమ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈనెల 24న లవ్ స్టోరీ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సారి సినిమా థియేటర్లలోకి రావడం గ్యారెంటీ. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే
థియేటర్లలోకి రావడం మొదలుపెట్టారు. ఆక్యుపెన్సీ పెరుగుతోంది. రెవెన్యూ వస్తోంది. దీంతో లవ్ స్టోరీ
నిర్మాతల్లో నమ్మకం పెరిగింది. అందుకే ఈసారి చెప్పిన తేదీకి లవ్ స్టోరీ వచ్చే అవకాశాలు ఎక్కువగా
ఉన్నాయి.

సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన సారంగదరియా పాట పెద్ద హిట్టయింది. రిలీజ్ కు ముందే కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

First Published:  11 Sept 2021 3:19 PM IST
Next Story