Telugu Global
Others

స్మార్ట్ కళ్లద్దాలపై ఓ లుక్కేయండి

కళ్లద్దాలు ఎవరైనా దేనికి ఉపయోగిస్తారు.. స్టైల్ కోసమో లేదా కంటికి రక్షణ కోసమో వాడుతుంటారు. కానీ కళ్లద్దాలతోనే ఫోన్ మాట్లాడొచ్చని, పాటలు వినొచ్చని, ఫోటోలు కూడా తీయొచ్చని మీకు తెలుసా..? ఫేస్‌బుక్‌, రేబాన్‌ సంస్థలు కలిసి ఓ సరికొత్త స్మార్ట్‌గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేశాయి. ‘రేబాన్‌ స్టోరీస్‌’ పేరుతో రిలీజైన ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ నిజంగా ఎంతో స్మార్ట్ గా పని చేస్తాయి. ఇందులోని ఫీచర్లేంటంటే.. రేబాన్ స్టోరీస్.. అన్నిరకాల స్మార్ట్ ఫీచర్స్ ను ఇన్ స్టాల్ చేసిన […]

స్మార్ట్ కళ్లద్దాలపై ఓ లుక్కేయండి
X

కళ్లద్దాలు ఎవరైనా దేనికి ఉపయోగిస్తారు.. స్టైల్ కోసమో లేదా కంటికి రక్షణ కోసమో వాడుతుంటారు. కానీ కళ్లద్దాలతోనే ఫోన్ మాట్లాడొచ్చని, పాటలు వినొచ్చని, ఫోటోలు కూడా తీయొచ్చని మీకు తెలుసా..?
ఫేస్‌బుక్‌, రేబాన్‌ సంస్థలు కలిసి ఓ సరికొత్త స్మార్ట్‌గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేశాయి. ‘రేబాన్‌ స్టోరీస్‌’ పేరుతో రిలీజైన ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ నిజంగా ఎంతో స్మార్ట్ గా పని చేస్తాయి. ఇందులోని ఫీచర్లేంటంటే..

రేబాన్ స్టోరీస్.. అన్నిరకాల స్మార్ట్ ఫీచర్స్ ను ఇన్ స్టాల్ చేసిన కళ్లద్దాలు. ఈ కళ్లద్దాలలో ఫ్రేమ్‌కి రెండువైపులా 5 ఎంపీ కెమెరాలు ఉంటాయి. వీటితో సుమారు 500 ఫొటోలు, 30 సెకన్ల నిడివి ఉన్న 35 వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కెమెరాకు ఇరుపక్కల ఎల్‌ఈడీ లైట్లు కూడా ఉంటాయి. వీటితో పాటు రేబాన్‌ స్టోరీస్‌లో ఫ్రేమ్‌కి రెండు వైపులా స్పీకర్స్‌ ఉంటాయి. వీటి ద్వారా తక్కువ సౌండ్ తో మ్యూజిక్‌ను ఆస్వాదించొచ్చు. అలాగే ఈ స్పీకర్స్ ద్వారా ఫోన్‌ కాల్స్‌ కూడా మాట్లాడొచ్చు. దానికోసం ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లో మూడు మైక్రోఫోన్స్ కూడా అమర్చారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ ను బ్లూటూత్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌ కు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్‌బుక్ వ్యూ యాప్‌ ద్వారా యూజర్లు స్మార్ట్‌గ్లాసెస్‌తో తీసిన ఫొటోలు, వీడియోలను చూడొచ్చు.

ఈ స్మార్ట్ గ్లాసెస్ ను టైప్ -సీ ఛార్జింగ్‌ కేబుల్‌తో ఛార్జ్‌ చేసుకోవచ్చు. సింగిల్ ఛార్జ్ కు 200 ఫొటోలు, 30 వీడియోలను తీసుకోవచ్చు. ఇకపోతే ఈ గ్లాసెస్ లో ఆరు రకాల లెన్స్‌ వేరియంట్లు ఉన్నాయి. రెగ్యులర్‌, పోలరైజ్‌డ్‌, ట్రాన్సిషన్ లెన్స్‌ తో ఈ గ్లాసెస్ రూపొందించారు. ఈ గ్లాసెస్ ధర రూ. 22,000 నుంచి రూ. 28,000 మధ్య ఉండొచ్చు.

First Published:  11 Sept 2021 9:25 AM IST
Next Story