ఫిరాయింపుల పార్టీగా రికార్డ్ సృష్టించిన బీజేపీ..
ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ వ్యతిరేక కూటమి అధికారంలో ఉందంటే దాని భవిష్యత్తు దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అనుకోవాల్సిందే. సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి వైరి పక్షాలను తమ దారికి తెచ్చుకోవడం ప్రభుత్వాలను కూలగొట్టి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి పరిపాటి. వలస నేతలతో ఈ పాచిక ప్రయోగించడంలో కమలదళం అందెవేసిన చేయి. గణాంకాలు చూస్తే బీజేపీ వలసలను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ […]
ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ వ్యతిరేక కూటమి అధికారంలో ఉందంటే దాని భవిష్యత్తు దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అనుకోవాల్సిందే. సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి వైరి పక్షాలను తమ దారికి తెచ్చుకోవడం ప్రభుత్వాలను కూలగొట్టి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి పరిపాటి. వలస నేతలతో ఈ పాచిక ప్రయోగించడంలో కమలదళం అందెవేసిన చేయి. గణాంకాలు చూస్తే బీజేపీ వలసలను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో బీజేపీ వలస నీతి బయటపడింది. 2014 నుంచి 2021 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 173 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆ పార్టీ ఆకర్షించింది. నయానో, భయానో.. తమలో కలిపేసుకుంది.
కర్నాటకలో అధికార మార్పిడికి బీజేపీ ఎన్ని కుతంత్రాలు పన్నిందో అందరికీ తెలుసు. పార్టీని నమ్ముకుని ఉన్నవారిని కాదని, వలస నేతలకు మంత్రి పదవులిచ్చి మరీ ప్రోత్సహించింది. కాంగ్రెస్ కూటమిని కూలగొట్టింది. బెంగాల్ ఎన్నికల సమయంలో టీఎంసీని ఖాళీ చేసేందుకు కమలదళం ఎన్ని ఎత్తులు వేసిందో తెలిసిన విషయమే. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో, ఎన్నికలైపోయిన తర్వాత, దేశవ్యాప్తంగా మొత్తం 253మంది అభ్యర్థులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టు ఏడీఆర్ నివేదికలో తేలింది.
ఫిరాయింపులతోనే బీజేపీకి బలం..
ఫిరాయింపులు అన్ని పార్టీలనుంచి, అన్ని పార్టీలలోకి ఉన్నా కూడా.. బీజేపీయే అత్యథికంగా వలసలతో బలం పెంచుకున్న పార్టీగా పేరు తెచ్చుకుంది. గత ఏడేళ్లలో ఫిరాయింపుదారులతో బీజేపీ ఎక్కువగా లాభపడగా.. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఇలాంటి వారి వల్ల నష్టపోయింది.
దేశవ్యాప్తంగా లెక్కలు ఇవీ..
దేశ వ్యాప్తంగా 500 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏడేళ్లలో ఒక పార్టీనుంచి ఇంకో పార్టీలోకి మారారు. మొత్తం 1,113 మంది అభ్యర్థులు తాము పోటీ చేసిన పార్టీని వదిలిపెట్టి పక్క పార్టీలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన 222 మంది అభ్యర్థులు ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. బీఎస్పీకి చెందిన 153 మంది అభ్యర్ధులు, 20 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. బీజేపీకి చెందిన 111 మంది అభ్యర్ధులు, 33 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కండువా మార్చడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా టీఆర్‌ఎస్‌లోకి 30 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫిరాయించారు.