Telugu Global
Cinema & Entertainment

టక్ జగదీష్ మూవీ రివ్యూ

నటీనటులు: నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు త‌దిత‌రులు ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌ నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది బ్యానర్: షైన్ స్క్రీన్ సంగీతం: త‌మ‌న్‌ (పాటలు) గోపీసుందర్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్) సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌ రేటింగ్: 2.75/5 “ఇదేదో కొత్త కథ కాదు. చిన్నప్పట్నుంచి మనం చూస్తున్న కథే. మన కుటుంబాల కథే. అవే ఎమోషన్స్ ను మళ్లీ చూపిస్తున్నాం” టక్ జగదీష్ రిలీజ్ కు ముందు నాని […]

టక్ జగదీష్ మూవీ రివ్యూ
X

నటీనటులు: నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు త‌దిత‌రులు
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్
సంగీతం: త‌మ‌న్‌ (పాటలు) గోపీసుందర్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్)
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
రేటింగ్: 2.75/5

“ఇదేదో కొత్త కథ కాదు. చిన్నప్పట్నుంచి మనం చూస్తున్న కథే. మన కుటుంబాల కథే. అవే ఎమోషన్స్ ను
మళ్లీ చూపిస్తున్నాం” టక్ జగదీష్ రిలీజ్ కు ముందు నాని చెప్పిన మాటలివి. అతడు అలా ఎందుకు చెప్పాడో ఈరోజు సినిమా చూసిన జనాలకు క్లియర్ గా అర్థమైంది. టక్ జగదీశ్ లో ఎలాంటి కొత్తదనం లేదు. పాత చింతకాయపచ్చడి కథ ఇది. 90ల్లో ఇలాంటి సినిమాలు కోకొల్లలు చూశాం. ప్రతి హీరో ఈ జానర్ టచ్ చేశాడు. ఇప్పుడు నాని దాన్ని కొత్తగా టచ్ చేశాడంతే.

తన బలమేంటో శివ నిర్వాణకు బాగా తెలుసు. నాని బలం ఏంటో కూడా అంతకంటే బాగా తెలుసు. వీళ్లిద్దరి కామన్ బలం ఎమోషన్. అందుకే రొటీన్ కథకు బలమైన ఎమోషన్ ను జోడించారు ఇద్దరూ. దర్శకుడు అనుకున్న ఎమోషన్ ను వందకు వందశాతం స్క్రీన్ పైకి తీసుకొచ్చాడు నాని. అందుకే రొటీన్ స్టోరీ అయినప్పటికీ టక్ జగదీష్ ఎక్కడా బోర్ కొట్టించడు. ఆ ఎమోషనే ఈ సినిమాను కాపాడింది.

భూదేవిపురం అనే ఊరిలో ఆదిశేషగిరి నాయుడు (నాజర్) పెద్ద మనిషి. ఆయనది పెద్ద కుటుంబం కూడా.
ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్ద కొడుకు బోస్ (జగపతి బాబు), చిన్న కొడుకు టక్ జగదీశ్ (నాని). మధ్యలో ఇద్దరు అక్కలు. ఊరిలో ఆదిశేషగిరి నాయుడు కుటుంబానికి వీరేంద్ర (డేనియల్ బాలాజీ) కుటుంబానికి పడదు. ఓ ప్రాజెక్టుకు సంబంధించి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో హఠాత్తుగా ఆదిశేషగిరి మరణిస్తాడు. కుటుంబంతో పాటు ఊరు బాధ్యతల్ని బోసు తీసుకుంటాడు.

అయితే ఊహించని విధంగా బోస్ విలన్ గా మారిపోతాడు. వీరేంద్ర కొడుకుతో చేతులు కలుపుతాడు.
మేనకోడల్ని (ఐశ్వర్యరాజేష్) శత్రువు కుటుంబానికి కోడలిగా పంపిస్తాడు. అక్కచెల్లెళ్లని ఇంట్లోంచి తరిమేస్తాడు. ఊరిలో భూముల్ని తన పేరిట రాయించుకుంటాడు. ఇలాంటి టైమ్ లో టక్ జగదీష్ ఏం చేశాడు? అన్నలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు? కుటుంబం మొత్తాన్ని తిరిగి ఎలా ఒక్కటిగా చేశాడు? అనేది బ్యాలెన్స్ కథ.

టైటిల్ లో ఉన్న టక్ సినిమాలో నాని గెటప్ లో మాత్రమే కనిపిస్తుంది. కథలో కనిపించదు. అందులో
తప్పులేదు కానీ ఆ ఎలిమెంట్ ను ఎలివేట్ చేసేలా సీన్లు సినిమాలో కనిపించవు. అదే వెలితిగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం రొటీన్ ప్లాట్ తో నడిపిన దర్శకుడు, సెకండాఫ్ కు వచ్చేసరికి తన బలం చూపించాడు. మంచి ఎమోషనల్ సీన్స్, ట్విస్టులతో అలరించాడు. అయితే ఇక్కడ కూడా అదే పాత ఫార్ములా కనిపిస్తుంది.

సెకండాఫ్ కు వచ్చేసరికి దర్శకుడిలో తొందర ఎక్కువగా కనిపించింది. జగపతిబాబు విలన్ షేడ్ ను చాలా
ఫాస్ట్ గా మార్చేశాడు. చివరి ట్విస్ట్ ను అంతే వేగంగా ప్రవేశపెట్టి, అంతే వేగంగా చల్లార్చాడు. ఇక క్లైమాక్స్
అయితే ఇక చాల్లే ముగించేద్దాం అన్నట్టు మమ అనిపించేశాడు. ఈ తతంగం అంతా ఇటుకపై ఇటుక
పేర్చినట్టు, 90ల నుంచి చూసిన పద్ధతిలోనే అలా అలా సాగిపోతుంది. అయితే బోర్ కొట్టదు. దానికి కారణం శివ నిర్వాణ డైలాగ్స్.

నాని లేకపోతే ఈ సినిమా లేదు. అంతలా ఈ మూవీని ఆదుకున్నాడు నాని. ఐశ్వర్యరాజేష్ క్యారెక్టర్ బాగుంది. రీతూవర్మకు రోల్ లేదు. మిగతా పాత్రలన్నీ డైలాగ్స్ మాత్రమే చెప్పాయి, మనసుకు హత్తుకోవు. టెక్నికల్ గా చూసుకుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ లో ఇంకాస్త తగ్గించొచ్చు.

మొత్తమ్మీద చూసేసిన సినిమానే మరోసారి కొత్త నటీనటులతో చూస్తున్న ఫీలింగ్ ఇస్తుంది టక్ జగదీష్.
అయినప్పటికీ నాని పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నిలబెడుతుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

First Published:  10 Sept 2021 1:01 PM IST
Next Story