కౌశిక్‌కు ఎమ్మెల్సీ లేనట్టేనా? గవర్నర్ తమిళ సై అనూహ్య నిర్ణయం..!
సహజంగా మంత్రివర్గం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ జాబితాను పంపిస్తే వెంటనే ఆమోదం లభిస్తుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసిన అనేకమందికి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. క్యాబినెట్ నిర్ణయమే దాదాపుగా ఫైనల్. ఇటీవల తెలంగాణ సర్కారు పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని భావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదించి గవర్నర్‌కు ప్రతిపాదన పంపింది. అయితే అనూహ్యంగా గవర్నర్ ఈ నియామకాన్ని పెండింగ్‌లో పెడుతూ వచ్చారు. ఈ విషయంపై […]
సహజంగా మంత్రివర్గం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ జాబితాను పంపిస్తే వెంటనే ఆమోదం లభిస్తుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసిన అనేకమందికి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. క్యాబినెట్ నిర్ణయమే దాదాపుగా ఫైనల్. ఇటీవల తెలంగాణ సర్కారు పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని భావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదించి గవర్నర్‌కు ప్రతిపాదన పంపింది. అయితే అనూహ్యంగా గవర్నర్ ఈ నియామకాన్ని పెండింగ్‌లో పెడుతూ వచ్చారు.
ఈ విషయంపై ఇంతకాలం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ.. అటు గవర్నర్ కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే తాజాగా గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఈ విషయంపై స్పందించారు. ‘పాడి కౌశిక్‌రెడ్డి సేవా కార్యక్రమాలు చేశారన్న కారణంతో ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ఈ విషయంపై ఇంకా అధ్యయనం సాగాల్సి ఉంది’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీంతో అంతా షాక్ అయ్యారు.
అయితే గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలు గానీ.. టీఆర్ఎస్ నేతలు గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ విషయం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి.పాడి కౌశిక్‌రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీచేశారు. అప్పట్లో ఈ స్థానం నుంచి ఈటల గెలుపొందారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అయితే ఆయన హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తారని అంతా భావించారు. కానీ కేసీఆర్ మాత్రం అక్కడ వ్యూహాత్మకంగా గెల్లు శ్రీనివాస్‌ను బరిలోకి దించారు.ఇక కౌశిక్‌రెడ్డికి ఆయన ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మాట ఇచ్చారు. అన్నట్టుగానే మంత్రి వర్గం కూడా ఆమోదించింది. కానీ ఈ నిర్ణయం పై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.