సినిమా టికెట్ల కోసం ఏపీ సర్కారు పోర్టల్..
చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. కొంత కాలం క్రితం థియేటర్లకు అనుమతి వచ్చింది. అయితే తెలంగాణలో ఇప్పటికే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కానీ ఆంధ్రాలో మాత్రం టికెట్ల ధరల విషయంలో పేచీ నెలకొన్నది. ఇప్పటికీ పలు చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల అవుతున్నాయి. స్టార్ హీరో వెంకటేశ్ హీరోగా తెరకెక్కించిన నారప్ప మూవీని కూడా ఓటీటీలో విడుదల చేశారు. నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేస్తుండటంతో థియేటర్ల యజమానులు […]
చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. కొంత కాలం క్రితం థియేటర్లకు అనుమతి వచ్చింది. అయితే తెలంగాణలో ఇప్పటికే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కానీ ఆంధ్రాలో మాత్రం టికెట్ల ధరల విషయంలో పేచీ నెలకొన్నది. ఇప్పటికీ పలు చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల అవుతున్నాయి. స్టార్ హీరో వెంకటేశ్ హీరోగా తెరకెక్కించిన నారప్ప మూవీని కూడా ఓటీటీలో విడుదల చేశారు.
నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేస్తుండటంతో థియేటర్ల యజమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. నిర్మాతల వ్యవహార శైలి పట్ల వాళ్లు కోపంగా ఉన్నారు. మొత్తంగా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. అయితే ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయినా.. థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో పెద్ద సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు జంకుతున్నారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లపై ఓ ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను రూపొందించింది. ప్రేక్షకులు ఆన్లైన్లోనే ఆ పోర్టల్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ తరహాలో నేరుగా ఆన్లైన్లో సినిమా టికెట్లను విక్రయిస్తున్నాయి. అయితే తాజాగా ఏపీ సర్కారే ఇటువంటి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఈ మేరకు ప్రభుత్వం ఓ జీవోను విడుదల చేసింది. ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని జీవోలో పేర్కొన్నారు.