అఖిల్ లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూడండి
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల […]
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల అయింది. అఖిల్ లోని 7 వెర్షన్స్ చూపిస్తూ విడుదలైన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో 7 విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు అక్కినేని హీరో.
ఫార్మల్ లుక్ నుంచి.. మోడ్రన్ అవతారం వరకు అన్ని షేడ్స్ లో అలరించాడు అఖిల్. తాజాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది యూనిట్.