Telugu Global
NEWS

తెలుగు రాష్ట్రాల్ని వణికిస్తున్న జ్వరాలు!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జ్వరాలు కలవరపెడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. వర్షాలు బాగా పడుతుండడంతో విషజ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వాతావరణంలో మార్పులొచ్చే సమయాల్లో వైరస్‌, బ్యాక్టీరియాలు స్వైరవిహారం చేస్తుంటాయి. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడపడితే అక్కడ నీళ్లు నిల్వ ఉంటున్నాయి. ఇవే దోమలకు అలాగే జ్వరాలకు కారణమవుతున్నాయి. తెలంగాణలో ఈ నెల మొదటి రెండు రోజుల్లోనే 188 డెంగీ కేసులు, 72 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇకపోతే ఏపీలో ఇప్పటివరకూ 1,575 […]

తెలుగు రాష్ట్రాల్ని వణికిస్తున్న జ్వరాలు!
X

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జ్వరాలు కలవరపెడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. వర్షాలు బాగా పడుతుండడంతో విషజ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.

వాతావరణంలో మార్పులొచ్చే సమయాల్లో వైరస్‌, బ్యాక్టీరియాలు స్వైరవిహారం చేస్తుంటాయి. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడపడితే అక్కడ నీళ్లు నిల్వ ఉంటున్నాయి. ఇవే దోమలకు అలాగే జ్వరాలకు కారణమవుతున్నాయి. తెలంగాణలో ఈ నెల మొదటి రెండు రోజుల్లోనే 188 డెంగీ కేసులు, 72 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇకపోతే ఏపీలో ఇప్పటివరకూ 1,575 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఎక్కువగా వస్తున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూ జ్వరాల లక్షణాలు ఎలా ఉంటాయంటే..

డెంగ్యూ లక్షణాలు..
డెంగ్యూ జ్వరం దోమ కుట్టడంవల్ల వస్తుంది.
డెంగ్యూ వస్తే విపరీతమైన తలనొప్పి వస్తుంది.
కళ్లు ఎర్రగా మారుతుంటాయి.
కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయి.
శరీరమంతా ఎర్రటి దద్దుర్లు రావొచ్చు.
అలసట, ఆకలి లేకపోవడం కూడా డెంగ్యూ లక్షణాలే.

ఇకపోతే మలేరియా లక్షణాలు ఇలా ఉంటాయి..
చలి
తీవ్రమైన జ్వరం
తలనొప్పి
వికారం
వాంతులు
చెమటలు పట్టడం
పొత్తి కడుపు నొప్పి
అతిసారం
రక్తహీనత
కండరాల నొప్పి
మూర్ఛ

ఇకపోతే టైఫాయిడ్ లక్షణాలు ఇవీ..
జ్వరం 102 నుండి 104 వరకూ ఉంటుంది.
కడుపు నొప్పి
దగ్గు
ఆకలి తగ్గిపోవడం
మలబద్ధకం
అతిసారం
​అలసట
గందరగోళం

ఫ్లూ లక్షణాలు ఇలా ఉంటాయి..
జ్వరం లేదా చలి జ్వరం
దగ్గు
శ్వాసలో ఇబ్బంది
అలసట
గొంతులో మంట
ముక్కు కారడం
కండరాల నొప్పులు
ఒళ్లు నొప్పులు
తలనొప్పి

ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే రక్త పరీక్ష చేయించుకుని డాక్టర్ను కలవాలి. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.

First Published:  7 Sept 2021 6:39 AM IST
Next Story