Telugu Global
International

కాబుల్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం..!

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైన తర్వాత అక్కడ విమాన సర్వీసులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్ విమానయాన సంస్థ అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ ఆగస్ట్ 31న యూఎస్ దళాలను ఉపసంహరించుకున్న తర్వాత అక్కడ విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి కాబూల్ కు విమాన సర్వీసులు తిరగడం లేదు. ఇన్ని రోజుల తర్వాత మొదటిసారిగా కాబుల్ విమానాశ్రయం నుంచి దేశీయ విమానాల సర్వీసులు ప్రారంభమయ్యాయి. అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ హెరాట్, మజార్ -ఇ -షరీఫ్, […]

కాబుల్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం..!
X

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైన తర్వాత అక్కడ విమాన సర్వీసులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్ విమానయాన సంస్థ అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ ఆగస్ట్ 31న యూఎస్ దళాలను ఉపసంహరించుకున్న తర్వాత అక్కడ విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి కాబూల్ కు విమాన సర్వీసులు తిరగడం లేదు. ఇన్ని రోజుల తర్వాత మొదటిసారిగా కాబుల్ విమానాశ్రయం నుంచి దేశీయ విమానాల సర్వీసులు ప్రారంభమయ్యాయి.

అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ హెరాట్, మజార్ -ఇ -షరీఫ్, కాందహర్ నగరాలకు తమ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. ఈ విషయాన్ని జిన్హువా న్యూస్ ఏజెన్సీ విషయాన్ని తెలిపింది. ఈ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. కాబుల్ విమానాశ్రయంలోని విమానాలను తిరిగి ప్రారంభించడానికి సహాయం చేసేందుకు ఖతార్ నుంచి ఓ సాంకేతిక బృందం అక్కడికి వెళ్లినట్లు సమాచారం.

కాబూల్ నుంచి విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వివిధ దేశాలకు చెందిన పలువురు ఆఫ్ఘనిస్థాన్ లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాబూల్ నుంచి దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లోని మరో స్థానిక విమానయాన సంస్థ కామా ఎయిర్ తాలిబన్లకు భయపడి తమ విమానాలను కాబుల్ విమానాశ్రయం నుంచి ఇరానియన్ నగరమైన మషాద్ కు మార్చినట్లు సమాచారం.

First Published:  6 Sept 2021 1:47 AM GMT
Next Story