Telugu Global
National

సీబీఐ పంజరంలో చిలక.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు..!

కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐపై తరచూ విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. సీబీఐ అధికార పార్టీకి జేబు సంస్థగా మారిపోయిందని.. ప్రత్యర్థులను టార్గెట్​ చేసేందుకు ఈ సంస్థను ఉపయోగించుకుంటున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తుంటాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా సీబీఐపై విమర్శలు చేసేది. ప్రస్తుతం విపక్షంలో ఉన్న కాంగ్రెస్​, ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం సీబీఐ తీరుపై నిత్యం అసంతృప్తి వ్యక్తపరుస్తుంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏకంగా సుప్రీంకోర్టే సీబీఐ తీరుపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. […]

సీబీఐ పంజరంలో చిలక.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు..!
X

కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐపై తరచూ విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. సీబీఐ అధికార పార్టీకి జేబు సంస్థగా మారిపోయిందని.. ప్రత్యర్థులను టార్గెట్​ చేసేందుకు ఈ సంస్థను ఉపయోగించుకుంటున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తుంటాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా సీబీఐపై విమర్శలు చేసేది. ప్రస్తుతం విపక్షంలో ఉన్న కాంగ్రెస్​, ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం సీబీఐ తీరుపై నిత్యం అసంతృప్తి వ్యక్తపరుస్తుంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏకంగా సుప్రీంకోర్టే సీబీఐ తీరుపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

‘సీబీఐకి స్వేచ్ఛ లేదని.. పంజరంలో చిలకలా మారిందని గతంలో మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రస్తుతం సుప్రీం కోర్టు సైతం ఈ వ్యాఖ్యలను ప్రస్తావించింది. సీబీఐ అనేక కేసులను విచారిస్తున్నప్పటికీ .. చాలా కేసులు నీరుగారిపోతున్నాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. ఇప్పటికైనా ఆ సంస్థ స్వేచ్ఛగా పనిచేయాలని పేర్కొన్నది. షోపియాన్​ జిల్లాలో ఇద్దరు మహిళలు హత్యకు గురైన ఘటనలో తప్పుడు సాక్ష్యాలు సృష్టించడంతో పాటు సాక్షులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై జమ్మూకశ్మీర్​కు చెందిన ఇద్దరు న్యాయవాదుల అరెస్ట్​కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

‘సీబీఐ ఇప్పటివరకు ఎన్ని కేసులు చేపట్టింది? వాటిలో ఎన్ని కేసుల్లో విజయం సాధించింది. ఈ విషయంపై ఓ క్లారిటీ కావాలి. ఇక సీబీఐలో ఏవైనా వసతుల లేమి ఉన్నా.. సిబ్బంది కొరత ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి.. ఈ విషయంపై సీబీఐ డైరెక్టర్​ ఆరువారాల్లో ఓ నివేదిక ఇవ్వాలి..అంటూ సుప్రీంకోర్టు.. సీబీఐ డైరెక్టర్​కు ఆదేశాలు జారీచేసింది.

First Published:  6 Sept 2021 3:16 PM IST
Next Story