ట్రాఫిక్ పోలీసుల బంపర్ ఆఫర్? ఫేక్ పోస్టులోనూ క్రియేటివిటీ..!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మంచి వార్తల కంటే తప్పుడు వార్తలే ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. కొందరు ఆకతాయిలు, మరికొందరు సైబర్ నేరగాళ్లు తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. కొందరు ఆకతాయిలైతే.. తప్పుడు ప్రకటనలు ఇస్తూ మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇక చాలా మంది సోషల్ మీడియాలో కనిపించిన పోస్టులను నిజం అని నమ్ముతున్నారు. మరికొందరేమో .. పోస్టు ఏమిటి? అందులోని నిజానిజాలు ఎంత? అన్న విషయాలు తెలియకుండా ఇతరులకు షేర్ చేస్తున్నారు. […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మంచి వార్తల కంటే తప్పుడు వార్తలే ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. కొందరు ఆకతాయిలు, మరికొందరు సైబర్ నేరగాళ్లు తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. కొందరు ఆకతాయిలైతే.. తప్పుడు ప్రకటనలు ఇస్తూ మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇక చాలా మంది సోషల్ మీడియాలో కనిపించిన పోస్టులను నిజం అని నమ్ముతున్నారు.
మరికొందరేమో .. పోస్టు ఏమిటి? అందులోని నిజానిజాలు ఎంత? అన్న విషయాలు తెలియకుండా ఇతరులకు షేర్ చేస్తున్నారు. దీంతోనే సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల ఓ ఆకతాయి.. ఇటువంటి పోస్టు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టాడు. అది నిజామేమోనని చాలామంది నమ్మారు.
‘దసరా పండుగ సందర్భంగా వాహనాలకు విధించిన చలాన్లపై 50 శాతం రాయితీ కల్పిస్తున్నాం. కేవలం సగం డబ్బు మాత్రమే కడితే.. మిగతాది మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి’..ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త. నిజానికి ఇది ఓ తప్పుడు వార్త.. చాలా మంది ప్రజలను మభ్యపెట్టేందుకు ఇటువంటి పోస్టులు పెడుతున్నారు.