టెన్త్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
తెలంగాణలో ఎట్టకేలకు బడులు తెరుచుకున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా పాఠశాలలు తెరవకపోవడంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఆన్లైన్ క్లాసులు మాత్రమే ఉంటున్నాయి. తమ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారోనని తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులు కొంత మేర ఆన్లైన్ క్లాసులు వింటున్నప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పల్లెటూరు విద్యార్థులు మాత్రం గత రెండేళ్లుగా చదువుకు దూరమయ్యారని చెప్పక తప్పదు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో.. ఆయా రాష్ట్రాల్లో మళ్లీ బడులు తిరిగి […]
తెలంగాణలో ఎట్టకేలకు బడులు తెరుచుకున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా పాఠశాలలు తెరవకపోవడంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఆన్లైన్ క్లాసులు మాత్రమే ఉంటున్నాయి. తమ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారోనని తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులు కొంత మేర ఆన్లైన్ క్లాసులు వింటున్నప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పల్లెటూరు విద్యార్థులు మాత్రం గత రెండేళ్లుగా చదువుకు దూరమయ్యారని చెప్పక తప్పదు.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో.. ఆయా రాష్ట్రాల్లో మళ్లీ బడులు తిరిగి ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 1 వతేదీ నుంచి తెలంగాణలోనూ స్కూళ్లు మొదలైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ సర్కారు పదో తరగతి షెడ్యూల్‌ను ప్రకటించింది. మార్చి లేదా ఏప్రిల్ నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేశారు.
ఈ ఏడాది 213 రోజులు పాఠశాల పనిదినాలుగా ప్రకటించారు. 47 రోజులు ఆన్లైన్లో, 116 రోజులు ప్రత్యేక తరగతుల ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 23న పాఠశాల చివరి వర్కింగ్ రోజు అని స్పష్టం చేశారు. ‘ఫిబ్రవరి 25 లోపు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తాం. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తాం. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు. అంతే కాకుండా అక్టోబర్ 6 నుంచి 17 వరకు 12 రోజుల పాటు దసరా సెలవులు, జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వబోతున్నాం’ అని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు.
పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది..కానీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో కరోనా కేసులు భయపెడుతుండగా, మరోవైపు కరోనా థర్డ్‌వేవ్ వచ్చేస్తుందంటూ కొందరు హెచ్చరిస్తుండటంతో వారు కలవరం చెందుతున్నారు.