Telugu Global
National

బెంగాల్ లో ఘర్ వాపసీ.. బీజేపీకి దెబ్బమీద దెబ్బ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ నుంచి వలసలను ప్రోత్సహించిన బీజేపీ ఇప్పుడు తీరిగ్గా చింతిస్తోంది. వచ్చినవారు వచ్చినట్టే.. ఇప్పుడు టీఎంసీలోకి క్యూ కడుతున్నారు. భారీ మెజార్టీతో టీఎంసీ అధికారం చేపట్టినా.. బీజేపీని పూర్తిగా బలహీన పరచాలనే ఉద్దేశంతో వలసలను ప్రోత్సహిస్తున్నారు సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ లో ఉప ఎన్నికల శంఖారావం మోగిన వేళ.. వలసలు మరింత స్పీడందుకోవడం విశేషం. తాజాగా.. సౌమెన్ రాయ్ అనే ఎమ్మెల్యే బీజేపీని వీడి టీఎంసీలో చేరారు. ఇప్పటికే […]

బెంగాల్ లో ఘర్ వాపసీ.. బీజేపీకి దెబ్బమీద దెబ్బ
X

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ నుంచి వలసలను ప్రోత్సహించిన బీజేపీ ఇప్పుడు తీరిగ్గా చింతిస్తోంది. వచ్చినవారు వచ్చినట్టే.. ఇప్పుడు టీఎంసీలోకి క్యూ కడుతున్నారు. భారీ మెజార్టీతో టీఎంసీ అధికారం చేపట్టినా.. బీజేపీని పూర్తిగా బలహీన పరచాలనే ఉద్దేశంతో వలసలను ప్రోత్సహిస్తున్నారు సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ లో ఉప ఎన్నికల శంఖారావం మోగిన వేళ.. వలసలు మరింత స్పీడందుకోవడం విశేషం. తాజాగా.. సౌమెన్ రాయ్ అనే ఎమ్మెల్యే బీజేపీని వీడి టీఎంసీలో చేరారు.

ఇప్పటికే ముకుల్‌ రాయ్‌, తన్మయ్‌ ఘోష్‌, విశ్వజిత్‌ దాస్‌ లు బీజేపీ కి గుడ్ బై చెప్పేసి టీఎంసీలోకి వచ్చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో కలియగంజ్‌ ఎమ్మెల్యే సౌమెన్‌ రాయ్‌ చేరారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు, ఉత్తర బెంగాల్‌ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు ఆయన ప్రకటించారు. సౌమెన్ రాయ్ తో కలసి టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం నాలుగుకి చేరింది. అయితే వీరంతా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన వారే.

పశ్చిమబెంగాల్ లో బీజేపీ గెలిచి తీరుతుందనే నమ్మకంతో.. సరిగ్గా ఎన్నికల ముందు చాలామంది టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. ఇతర పార్టీలనుంచి కూడా భారీగానే బీజేపీకి వలసలొచ్చాయి. 294 స్థానాల బెంగాల్ అసెంబ్లీకి 291 చోట్ల బీజేపీ తన అభ్యర్థుల్ని నిలబెట్టగా అందులో 148మంది వలస నాయకులే కావడం విశేషం. 12మంది టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ టికెట్ పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో సగం మంది ఓడిపోయారు. ఆ మిగిలిన సగం కూడా ఇప్పుడు సొంత గూటికి చేరుకుంటున్నారు.

ఉప ఎన్నికల వేళ గట్టి ఎదురు దెబ్బ..
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచినా.. మమతా బెనర్జీ ఓడిపోవడం విశేషం. అయితే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన ఆమె, ఇప్పుడు ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. సరిగ్గా ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 24గంటల్లోగా ఎమ్మెల్యే బీజేపీని వీడి టీఎంసీలో చేరారు. టీఎంసీనుంచి బయటకు వెళ్లినవారే కాదు, బీజేపీ సొంత నేతలు కూడా రాబోయే రోజుల్లో టీఎంసీలో చేరతారని ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

First Published:  5 Sept 2021 2:26 AM IST
Next Story