బాలయ్య నెక్ట్స్ సినిమాకు ముహూర్తం
ప్రస్తుతం అఖండ అనే సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. వచ్చే వారం నుంచి ఫైనల్ షెడ్యూల్ మొదలవుతుంది. ఇది కంప్లీట్ అవ్వడంతో కొత్త సినిమాకు లైన్ క్లియర్ చేశాడు బాలయ్య. ఆల్రెడీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను లైన్లో పెట్టిన ఈ హీరో, ఇప్పుడు ఇదే ఊపులో ఇంకో మూవీని కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నాడు. అదే అనీల్ రావిపూడి సినిమా. అవును.. ఎన్నాళ్లనుంచో నలుగుతున్న బాలయ్య-రావిపూడి ప్రాజెక్టు ఎట్టకేలకు కొలిక్కి […]
ప్రస్తుతం అఖండ అనే సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. వచ్చే
వారం నుంచి ఫైనల్ షెడ్యూల్ మొదలవుతుంది. ఇది కంప్లీట్ అవ్వడంతో కొత్త సినిమాకు లైన్ క్లియర్ చేశాడు బాలయ్య. ఆల్రెడీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను లైన్లో పెట్టిన ఈ హీరో, ఇప్పుడు ఇదే ఊపులో ఇంకో మూవీని కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నాడు. అదే అనీల్ రావిపూడి సినిమా.
అవును.. ఎన్నాళ్లనుంచో నలుగుతున్న బాలయ్య-రావిపూడి ప్రాజెక్టు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. దసరాకు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది
నిర్మాతలుగా ఈ సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని ఆ నిర్మాతలే స్వయంగా బయటపెట్టారు.
చాన్నాళ్ల కిందటే బాలయ్యకు నెరేషన్ ఇచ్చాడు అనీల్ రావిపూడి. ఇందులో అనీల్ మార్క్ పంచ్ లతో పాటు, బాలయ్య మార్క్ యాక్షన్ కూడా ఉండబోతోంది. ఎఫ్3 సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే బాలయ్య-అనీల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వస్తుంది.