Telugu Global
Health & Life Style

లాంగ్ కోవిడ్ తో జాగ్రత్త

కోవిడ్ నుంచి కోలుకున్న చాలామందికి ప్రస్తుతం లాంగ్ కోవిడ్ సమస్య వేధిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కొంతమందిలో లాంగ్ కోవిడ్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. లాంగ్ కోవిడ్ ప్రభావం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు నెలల తరబడి అలాగే ఉంటున్నాయి. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన తర్వాత కూడా శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, అలసట వంటి లక్షణాలు నెలల తరబడి వేధిస్తుంటే ఇలాంటి వాటిని లాంగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు. ముఖ్యంగా రక్తం […]

లాంగ్ కోవిడ్ తో జాగ్రత్త
X

కోవిడ్ నుంచి కోలుకున్న చాలామందికి ప్రస్తుతం లాంగ్ కోవిడ్ సమస్య వేధిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కొంతమందిలో లాంగ్ కోవిడ్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. లాంగ్ కోవిడ్ ప్రభావం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు నెలల తరబడి అలాగే ఉంటున్నాయి. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన తర్వాత కూడా శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, అలసట వంటి లక్షణాలు నెలల తరబడి వేధిస్తుంటే ఇలాంటి వాటిని లాంగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు. ముఖ్యంగా రక్తం గడ్డకట్టే లక్షణాలు ఉన్నవారిలో ఈ లాంగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న చాలామంది ఇప్పుడు లాంగ్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. కోవిడ్ ఎఫెక్ట్ లంగ్స్ పై ఎక్కువగా పడడం వల్ల కొంతమందిలో ఊపిరితిత్తుల కండరాలు దెబ్బతింటాయి. దాంతో శ్వాస ఇబ్బందులు, ఆయాసం, ఒత్తిడి లాంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి.

అయితే ఈ లాంగ్ కోవిడ్ సమస్యలకు ఎలాంటి మెడిసిన్ లేదు. సరైన ఆహారం, వ్యాయామంతో మెల్లగా సమస్యలను తగ్గించుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.వీలైనంత ఎక్కువగా ఇమ్యూనిటీని పెంచుకునే ప్రయత్నం చేయాలి. కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు లాంటివి ఎక్కువ తినాలి. తగినంత నిద్ర, వ్యాయామం ఉండాలి. ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా డ్యామేజ్ అయిన కణాలు వాటంతట అవే రిపేర్ అవుతాయి. కరోనా తగ్గిన తర్వాత జలుబు, కళ్లు ఎర్రబడడం, ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు తలెత్తినప్పుడు వెంటనే డాక్టర్ను కలవాలి.

First Published:  4 Sept 2021 4:13 AM GMT
Next Story