Telugu Global
Andhra Pradesh

టీటీడీ 'ధన ప్రసాదం'

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న నిర్ణయాలు ఇటీవల వివాదాస్పదంగా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవల టీడీపీ తీసుకొచ్చిన సంప్రదాయ అన్న ప్రసాదం వివాదాస్పదంగా మారింది. టీటీడీ .. సేంద్రియ ఉత్పత్తులతో అన్న ప్రసాదం తీసుకొచ్చింది. కాస్ట్ టు కాస్ట్ పేరిట ఈ అన్న ప్రసాదం కోసం నామ మాత్రం రుసుమును వసూలు చేస్తామంటూ ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. తిరుపతిలో .. టీటీడీ పెట్టే భోజనానికి డబ్బు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ నెటిజన్లు […]

prasad scheme
X

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న నిర్ణయాలు ఇటీవల వివాదాస్పదంగా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవల టీడీపీ తీసుకొచ్చిన సంప్రదాయ అన్న ప్రసాదం వివాదాస్పదంగా మారింది. టీటీడీ .. సేంద్రియ ఉత్పత్తులతో అన్న ప్రసాదం తీసుకొచ్చింది. కాస్ట్ టు కాస్ట్ పేరిట ఈ అన్న ప్రసాదం కోసం నామ మాత్రం రుసుమును వసూలు చేస్తామంటూ ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.

తిరుపతిలో .. టీటీడీ పెట్టే భోజనానికి డబ్బు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. దీంతో టీటీడీ వెనక్కి తగ్గింది. 'అన్న ప్రసాదం' నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.ఇదిలా ఉంటే తాజాగా టీటీడీ మరో నిర్ణయాన్ని తీసుకొచ్చింది. అదే ధన ప్రసాదం స్కీం.

ఇంతకీ ఈ స్కీం ఏమిటంటే.. ప్రస్తుతం తిరుమల హుండీలో నాణెలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. తిరుపతి వెళ్లే భక్తులంతా ఈ నాణేలను తిరుమల హుండీలో వేస్తారన్న విషయం తెలిసిందే. ఈ నాణేలు పేరుకుపోయాయి. వీటిని .. ధన ప్రసాదం పేరిట భక్తులకు ఇవ్వబోతున్నారు.. అనడం కంటే కట్టబెడుతున్నారు..అని చెప్పాలేమో..చిల్లర కొండల్ని కరిగించేందుకు వీలుగా టీటీడీ కొత్త ఆలోచన చేసింది. రూపాయి నాణేలతో కూడిన రూ.వంద పాకెట్ ను సిద్ధం చేసింది. దానికి 'శ్రీవారి ధన ప్రసాదం' అంటూ అందమైన పాకెట్ గా రూపొందించింది.

తిరుమలకు వచ్చిన భక్తులు బస చేసే అతిథి గృహాల రిసెప్షన్ కేంద్రాల్లో చిల్లర నాణేలను 100 రూపాయల ప్యాకెట్ల రూపంలో ప్రత్యేక కవర్లలో భక్తులకు అందిస్తుంది. భక్తులు గదుల్ని అద్దెకు తీసుకొని.. చివర్లో తమ డిపాజిట్లను తిరిగి తీసుకునే సమయంలో ఈ పాకెట్లను నోట్లకు బదులుగా ఇస్తారు.
అయితే ఈ డబ్బును తీసుకొనేందుకు నిరాకరించే భక్తులకు నోట్లు ఇవ్వనున్నారు. ఈ పథకంపై భక్తుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

First Published:  2 Sept 2021 7:50 AM IST
Next Story