Telugu Global
Cinema & Entertainment

పుష్ప మూవీ షూటింగ్ అప్ డేట్స్

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. కొన్ని రోజులుగా షూటింగ్ కు దూరంగా ఉన్న ఈ సినిమా, ఇప్పుడు మరోసారి సెట్స్ పైకి వెళ్లబోతోంది. రేపట్నుంచి పుష్ప పార్ట్-1కు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలుకాబోతోంది. ఈ షెడ్యూల్ తో పుష్ప-ది రైజ్ కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. ప్రస్తుతం ‘పుష్ప’ టీం మారేడుమిల్లి బయలుదేరింది. రేపటి నుండి అక్కడ అల్లు అర్జున్ -ఫహాద్ ఫాజిల్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. అలాగే బన్నీ-రష్మిక మధ్య ఓ […]

పుష్ప మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. కొన్ని రోజులుగా షూటింగ్ కు దూరంగా ఉన్న ఈ సినిమా, ఇప్పుడు మరోసారి సెట్స్ పైకి వెళ్లబోతోంది. రేపట్నుంచి పుష్ప పార్ట్-1కు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలుకాబోతోంది. ఈ షెడ్యూల్ తో పుష్ప-ది రైజ్ కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది.

ప్రస్తుతం ‘పుష్ప’ టీం మారేడుమిల్లి బయలుదేరింది. రేపటి నుండి అక్కడ అల్లు అర్జున్ -ఫహాద్ ఫాజిల్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. అలాగే బన్నీ-రష్మిక మధ్య ఓ సాంగ్ కూడా షూట్ చేస్తారు. దాదాపు 3 వారాల పాటు ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. మారేడుమిల్లి షెడ్యూల్ తర్వాత, నేరుగా హైదరాబాద్ వచ్చి ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఐటెం సాంగ్ తీస్తారు.

దీంతో టోటల్ షూట్ కి గుమ్మడికాయ కొట్టబోతోంది యూనిట్. పుష్ప సినిమాకు సంబంధించి ప్రతిది కాస్త
భిన్నంగా ప్లాన్ చేస్తున్న యూనిట్.. గుమ్మడికాయ ఫంక్షస న్ ను కూడా డిఫరెంట్ గా చేయబోతున్నట్టు టాక్. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా పుష్ప పార్ట్-1 రిలీజ్ కాబోతోంది. వచ్చే ఏడాది పార్ట్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

First Published:  2 Sept 2021 2:18 PM IST
Next Story